– సీపీఎం కార్యదర్శి బాబురావు
విజయవాడ: మరోసారి బుడమేరు ముంపు ప్రమాదం ఉన్నా, పూడికతీత కూడా పూర్తిచేయకుండా పాలకుల నిర్లక్ష్యం చూపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, తదితర నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు శనివారం న్యూ రాజరాజేశ్వరి పేటలో బుడమేరు పరివాహక ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బుడమేరు ముంపులో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోలేదని విమర్శించారు. రాజరాజేశ్వరి పేట రైల్వే లైన్ వద్ద బుడమేరు పూడికపోయిందని, బుడమేరు పూడికతీత కోసం కేటాయించిన 100 కోట్లు ఏమయ్యాయి? వారు ప్రశ్నించారు. జల వనరుల శాఖ మొద్దు నిద్రలో ఉందన్నారు.