– రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో స్థిరమైన వృద్ధితో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచింది. కర్ణాటక, హర్యానాలను అధిగమించి రికార్డు సాధించింది. వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్ లోనే 33.64% సాధించడం అభినందనీయమని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే..
ఇందిరమ్మ ఇళ్లకు, స్వయం ఉపాధి పథకాలకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు, ఇవ్వండి.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుంది. రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు.
రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి, ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండి అంటూ రైతులను ఒత్తిడి చేయవద్దు. బ్యాంకర్లు మానవి కోణంలో ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో (ప్రతి వ్యక్తి ఆదాయంలో రూ. 3.87 లక్షలతో) అగ్రస్థానంలో నిలిచింది, కర్ణాటక, హర్యానాలను అధిగమించి, ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ అగ్రస్థానాన్ని సాధించిందని అన్నారు. వ్యవసాయం పరిశ్రమలు, సేవా రంగం స్థిరమైన వృద్ధితో మొత్తంగా తెలంగాణ భారతదేశంలో అత్యంత చురుకైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మనమందరం దీని నుంచి ప్రేరణ పొంది, మన ప్రజల సమగ్ర సంక్షేమం కోసం మరింత కృషికి ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు. తెలంగాణ రైసింగ్ లో బ్యాంకర్ల పాత్ర ఉంది ఉన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో బ్యాంకులు ప్రాధాన్య రంగ రుణాల విభాగంలో మంచి ఫలితాలు సాధించటం పట్ల సంతోషంగా ఉందనీ తెలిపారు. ప్రాధాన్య రంగంలో ఏసీపీ(వార్షిక కరుణ ప్రణాళిక) రుణ లక్ష్యాలలో మొదటి త్రైమాసికంలోనే 33.64% సాధించడం అభినందనీయం అన్నారు.
రాష్ట్రం నిరంతరం అధిక సీడి రేషియోను కొనసాగించడం గర్వకారణం. ఈ త్రైమాసికంలో ఇది 126.50% గా ఉంది. తెలంగాణ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటి. పరిశ్రమలు, వ్యవసాయం, సేవా రంగాల్లో బలమైన వృద్ధితో పాటు, అనేక అభివృద్ధి కార్యక్రమాలను మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందనీ డిప్యూటీ సీఎం వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావించి, పలు పథకాలను అమలు చేస్తోంది, అర్హులైన రైతులకు రూ. 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, రైతు భరోసా, కొన్ని పంటలకు బోనస్, ప్రధాన-మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వంటివి ఉన్నాయి. వీటి ఫలితంగా వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా పెరుగుతోంది అన్నారు. రైతుల కోసం ఇచ్చిన హామీని నిలబెట్టి సీఎల్డబ్ల్యు-2024 పథకం కింద అర్హులైన వారికి రుణ మాఫీని తక్కువ సమయంలోనే అమలు చేసి చరిత్ర సృష్టించాం అని తెలిపారు. వీటిలో గణనీయ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డు ఖాతాలు పునరుద్ధరించి, రైతులకు నిధులు విడుదల చేసాం అన్నారు. పంట ఉత్పత్తి, ముఖ్యంగా వరి ఉత్పత్తి పెరగడంతో, తెలంగాణ ఎఫ్సీఐకి వరి సరఫరా చేసే ప్రధాన రాష్ట్రాలలో ఒకటిగా ఎదుగుతోందనీ వివరించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావిస్తుంది. రైతుల పక్షాన రైతు రుణమాఫీ, రైతు భరోసా పేరిట 30 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇది ఒక రికార్డు అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని రైతులకు సకాలంలో, పెద్ద ఎత్తున బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలి. ఈ త్రైమాసిక సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హృదయపూర్వక అభినందనలు