* నీకు కావాల్సినంత సమయం ఇస్తాం రా…
* నీలి మీడియాలో తప్పుడు ప్రచారం మానుకో…
* జగన్ హయాంలో దిగజారిన ఏపీ వైద్య, ఆరోగ్య ప్రమాణాలు
* 17 మెడికల్ కాలేజీల నిర్మాణమంటూ హడావుడి
* 5 మెడికల్ కాలేజీలు మాత్రమే కేంద్ర, నాబార్డు నిధులతో నిర్మాణం
* మిగిలిన కాలేజీలకు ఇటుక బెడ్డ కూడా వేయలేదు
* ఆరోగ్యశ్రీని అనారోగ్య శ్రీ మార్చేసిన జగన్
* టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే ప్రజారోగ్యానికి పెద్దపీట
– మంత్రి సవిత
పెనుకొండ: యూరియా, ఉల్లి, మెడికల్ కాలేజీలు ఇలా ఏ అంశంపైనైనా అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని, ఆయనకు కావాల్సినంత సమయం ఇస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆఫర్ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి రాకుండా తన నీలి మీడియాలో తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పాలనలోనే ఏపీలో వైద్య విద్యకు పెద్దపీట పడిందని, ప్రజారోగ్య రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకున్నారని తెలిపారు.
అయిదేళ్ల జగన్ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూపాయి కూడా వినియోగించలేదన్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు కూడా చెల్లించలేదన్నారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులతో కలిసి ఆమె మాట్లాడారు. రూ.8,480 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నానంటూ 2020లో జగన్ డబ్బా కొట్టాడన్నారు. వాస్తవంగా చూస్తే… నాబార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.2,125 నిధులను మాత్రమే 5 మెడికల్ కాలేజీలకు ఖర్చు చేశాడన్నారు. ఆ 5 భవన నిర్మాణాలకు రూ.674 కోట్లు బకాయిలు పెట్టాడన్నారు.
ప్రచార యావ కోసం అసంపూర్తిగా ఉన్నఆ అయిదు కాలేజీలను ప్రారంభించేశాడన్నారు. అరకొర వసతులు, ఫ్యాకల్టీని కూడా పూర్తి స్థాయిలో నియమించకుండానే తరగతులు మొదలెట్టేశాడన్నారు. మిగిలిన కాలేజీల నిర్మాణానికి ఒక్క ఇటుక బెడ్డ కూడా వేయలేదని, ఇదీ జగన్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శమని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడళ్లలో నిర్మించాలని నిర్ణయించిందని, దీనిపై జగన్ తప్పుడు ప్రచారం చేయడం దారుణమని అన్నారు.
జగన్ హయాంలో దిగజారిన ప్రజారోగ్యం
అయిదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్యం దిగజారిపోయిందని మంత్రి సవిత తెలిపారు. 2014-19 మధ్య కాలంలో నీతి అయోగ్ ర్యాంకింగ్ లో వైద్య ప్రమాణాల్లో ఏపీ 4వ స్థానంలో నిలిచిందన్నారు. జగన్ పాలనలో పదో స్థానానికి పడిపోయిందన్నారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చాడన్నారు. ఆరోగ్య శ్రీకి రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టాడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.1900 కోట్ల బకాయిలు చెల్లించిందని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైద్య విద్యను దూరం చేశాడని ఆగ్రహం వ్యక్తంచేవారు. జగన్ నిర్లక్ష్యం వల్ల కరోనా సమయంలో 50 వేల మందికి పైగా మరణించారన్నారు