– భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో చారిత్రాత్మక విజయం
– 152 ఓట్ల మెజారిటీతో సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం.
– ఎన్డీయే ఐక్యత, ప్రజల నమ్మకానికి ప్రతిబింబం
– ఈ విజయం రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక ఐక్యతకు శక్తివంతమైన సందేశం.
ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీ.పి. రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విజయం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్డీయే ఐక్యత మరియు దేశ సమగ్ర అభివృద్ధికి గొప్ప సంకేతంగా నిలిచింది. రాధాకృష్ణన్ ప్రజల సంక్షేమం, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.
ఈ ఘన విజయంతో ఆయన భారత ఉప రాష్ట్రపతిగా ప్రభావవంతంగా సేవలందిస్తారని గర్వంగా విశ్వసిస్తున్నాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధి, సామాజిక సమన్వయం, సమగ్ర పురోగతికి ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తోంది. ఈ ఘన విజయం, అభివృద్ధి చెందిన, వెనుకబడిన వర్గాల శక్తివంతమైన ప్రతినిధిని ఉప రాష్ట్రపతిగా ఎన్నుకోవడమేనని భావిస్తున్నాం.
సీపీ రాధాకృష్ణన్ ఎంబీసీ వర్గానికి చెందిన నాయకుడిగా, దేశ ప్రజల సంక్షేమం, సమాజ సమన్వయానికి నిత్యం కృషి చేస్తున్నారు. సీపీ రాధాకృష్ణన్ భారత రాష్ట్రానికి 17వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడంతో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలపడుతుందని, దేశ అభివృద్ధికి, స్థిరతకు ఇది శక్తివంతమైన సంకేతంగా ఉంటుందని భావిస్తున్నాం.