– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్ రావు
హైదరాబాద్: గ్రూప్-1 పరీక్ష పత్రాల రీవాల్యూయేషన్ చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నిర్వహించిన మెయిన్స్ పరీక్షల్లో పరీక్షా ప్రక్రియలో గందరగోళాలు, నిర్వహణలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని తేల్చిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థలో ఉన్న లోపాలు బయటకు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి లక్షలాది మంది విద్యార్థుల పాలిట శాపంగా మారింది.
నోటిఫికేషన్ విడుదల నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం వరకు టీజీపీఎస్సీ చాలా లోపాలతో కూడిన విధానాలను అవలంబించిందని విమర్శించారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూశారు. ఈ తీర్పు ద్వారా వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ పేపర్ లీకేజీ ఘటనలతో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. అదే పరంపరను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరగడంతో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది.