బెంగళూరులో జరుగుతున్న మూడు రోజుల 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (CPA) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి బెంగుళూరు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ , లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు అధికారుల ఆద్వర్యంలోని తెలంగాణ శాసనమండలి బృందానికి సాదర స్వాగతం లభించింది .
ఈ సందర్భంగా కర్ణాటక విదాన సౌద వద్ద కన్నడ సాంప్రదాయంలో కర్ణాటక శాసనసభ అధికారులు. స్వాగతం . పలికారు. అనంతరం లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య అసెంబ్లీ స్పీకర్ U T ఖదీర్ ఫరీద్, డిప్యూటి స్పీకర్ రుద్రప్ప మల్లప్ప లామ్ని, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, శాసనపరిషత్ చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు, లేజిస్లేటివ్ సెక్రటరీలను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ శాసన బృందం సదస్సు అంశాలపై ముచ్చటించారు.