– ప్రాణాలకు తెగించి జగన్‌పై పోరాడారు
– మేం కూడా మీ స్ఫూర్తితోనే పోరాడాం
– కూటమి ఏర్పాటులో మీదే కీలకపాత్ర
– ఐపిఎస్ సునీల్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?
– మీకు మంత్రి పదవి రాకపోవడం నిరాశ కలిగించింది
– ఇప్పుడు మీరు జగన్‌ను ఎందుకు విమర్శించడం లేదు?
– రఘురామరాజుకు ఘన స్వాగతం పలికిన తెలుగువారు
– బెంగళూరు ఎయిర్‌పోర్టులో డిప్యూటీ స్పీకర్
– రఘురామకృష్ణంరాజుతో అక్కడి తెలుగువారి మాటామంతీ
– అందరికీ ఓపికగా బదులిచ్చిన రఘురామరాజు
– ఏపీకి వచ్చిన భోజనానికి ఇంటికి రమ్మని ఆహ్వానించిన డిప్యూటీ స్పీకర్ రాజు
బెంగళూరు: స్పీకర్ల సదస్సుకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా హాజరువుతున్నారని తెలిసిన బెంగళూరులోని తెలుగువారు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. తాను ఇక్కడకు వస్తున్నట్లు మీకెలా తెలుసని రాజు వారిని ప్రశ్నించగా.. తాము మీడియాలో చూసి ఇక్కడకు వచ్చామని రఘురామకృష్ణంరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.
‘‘మీరు వైసీపీ ఎంపీగా ఉంటూ జగన్‌పై ధైర్యంగా చేసిన తిరుగుబాటు మాలాంటి వారిని ఉత్సాహపరిచింది. అప్పుడు మీరు ఏపీలో జగన్‌పై యుద్ధం మొదలుపెట్టకపోతే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో. జగన్‌కు ప్రాణమిత్రుడైన కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటికీ మీరు హైదరాబాద్‌లో జరిగిన అనేక నిరసన సభలకు హాజరవడం మేము మీడియా, మీ ఫేస్బుక్లో చూశాం. అసలు మీరు యుద్ధం మొదలుపెట్టిన తర్వాతనే టీడీపీ,జనసేన, ఆలాంటి ప్రజలు ధైర్యంగా రోడ్డుపైకొచ్చి పోరాడాం. మేం కూడా అరెస్టులు, కేసులకు భయపడకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టాం. ఇదంతా మీ స్ఫూర్తితోనే.
మిమ్మల్ని చిత్రహింసలు పెట్టిన పోలీసు అధికారులను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని మీడియాలో చూసి, బాధపడుతుంటాం. మీలాంటి వారికే న్యాయం జరగ కపోతే ఎలా సార్? అసలు మీకు నర్సాపురం ఎంపీ సీటు ఇస్తే కేంద్రమంత్రి అవుతారనుకున్నాం. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన మీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం టీడీపీ సైనికులుగా, మీ అభిమానులుగా మమ్మల్ని నిరాశపరిచింది. ఈసారైనా మీలాంటి ఫైటర్‌కు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నా’’మని వారు రఘురామరాజుతో వ్యాఖ్యానించారు. మీకు మంత్రి పదవి ఇస్తే జగన్.. మీ భయానికే ఇక కూటమిపై విమర్శలు మానుకుంటారని మరికొందరు వ్యాఖ్యానించారు.
దానికి స్పందించిన ‘‘ఆరోజు నేను నా ప్రాణాలకు కూడా తెగించి జగన్‌పై పోరాడింది కేవలం ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే. అందులో నా స్వార్థమేమీ లేదు. నేను కూడా అందరి మాదిరిగా పదవి కోసమో, డబ్బు కోసమో జగన్‌తో సర్దుకుపోవచ్చు. కానీ నాకు రాష్ట్రం-ప్రజలు ముఖ్యం. ప్రజల రక్తం పీలుస్తున్న రాక్షసుడిని తరమివేయాలన్న సంకల్పంతోనే బరిలోకి దిగా. అందుకు అన్నిటికీ సిద్ధమయ్యా. పోలీసులు నన్ను ఎలా హింసించారో మీరూ చూశారు. మీ అందరి అండ, దైవం ఆశీస్సులు, మోదీ-అమిత్‌షా- చంద్రబాబు-పవన్ కల్యాణ్-లోకేష్ మద్దతుతోనే బయటపడగలిగా. ఇక మంత్రి పదవులనేవి సీఎం ఇష్టం. దానిపై నేను కామెంట్ చేయను. మీ అందరి అభిమానం చాలు. ఈసారి హైదరాబాద్ లేదా విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి భోజనానికి రండి’’ అని రాజు వారికి బదులిచ్చారు.
ఇక తనను చిత్రహింసలు పెట్టిన పోలీసులను, ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదన్న వారి ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘విచారణ జరుగుతోంది. వారిని అరెస్టు చేసి నాకు సీఎం గారు న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది. విచారణ ప్రక్రియ కొద్దిగా ఆలస్యం కావచ్చేమోగానీ, నాకైతే న్యాయం జరుగుతుందనే అనుకుంటున్నా’’ అన్నారు.
ఆ సందర్భంగా.. మీరు డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత జగన్‌పై విమర్శలు తగ్గించినట్లున్నారని సందేహం వ్యక్తం చేయగా ‘‘ ఎన్నికల ముందు జగన్ అనే జనకంటకుడిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో.. మీరన్నట్లు, ఎవరూ బయటకు రాకముందే జగన్‌పై యుద్ధానికి గజ్జె కట్టా. నన్ను రాష్ట్రానికి రానీయకుండా అడ్డుకున్నా నా ఫేస్బుక్, మీడియా ద్వారా నా వాణి కోట్లాది తెలుగు ప్రజలకు వినిపించా. ఆ సందర్భంలో అశేష తెలుగుప్రజలు నన్ను తనవాడిగా భావించారు. ఆ ఎన్నికల్లో జగన్ నేలకూలారు. 11 సీట్లకు పరిమితమయ్యారు. మేం అధికారంలోకి వచ్చాం. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నా. ఇప్పుడు జగన్ చచ్చినపాముతో సమానం. అలాంటి వారిపై ఇంకా నేను మాట్లాడటం బాగుండదు’’ అని వారికి వివరించారు.
కాగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో రఘురామకృష్ణంరాజుకు స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగువారిని చూసి.. అటుగా వెళుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆశ్చర్యపోయారు. ఇక్కడకు ఇంతమందికి ఎలా వచ్చారని విస్మయం చెందారు. తాము రాజుగారి కోసమే వచ్చామనడంతో నవ్వుతూ, రఘురామరాజుకు షే క్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయారు.