– రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఎత్తి పట్టుకున్నారు
– ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ లో ప్రైవేటీకరణ చేస్తున్నాం అంటే ఒక్కరైనా మాట్లాడారా?
– విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు
– టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు పెట్టుకున్న వాళ్లే
– ప్రజాస్వామ్యంలో చట్టసభలకు విలువ ఉంది
– నేడు ఆ సభలకే వెళ్ళమని మానేస్తున్నారు
– చట్టసభలకు ఎన్నికై వెళ్లకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కుల మీద కోట్లాడాలి కదా?
– విశాఖ ఉక్కు పరిరక్షణపై ఎంబీ భవన్ లో అఖిలపక్ష సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: 2021 లో చంద్రబాబు విపక్ష నేతగా కేంద్రానికి ఒక లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. తెలుగు దేశం పార్టీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని లేఖ ద్వారా చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? ప్రతిపక్ష నాయకుడిగా ప్రాణాలు అడ్డు వేస్తా అన్నారు. ఒకనాడు వాజ్ పేయి హయంలో ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే అడ్డుపడ్డాను గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?
బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందంటే ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇచ్చిన మద్దతుతోనే… టీడీపీ, జనసేన బీజేపీని ఎత్తిపట్టుకుంది. వైసీపీ అనధికారికంగా బీజేపీని మోస్తోంది. అందరు కలిసి బీజేపీని ఎత్తిపట్టుకున్నారు. బీజేపీ అధికారంలో ఉంది అంటే ఆంధ్రా రాష్ట్ర ఎంపీలు కారణం. వీపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మూకుమ్మడిగా అందరూ మద్దతు ఇచ్చారు. అందరు కలిసి కట్టుగా ఉన్నారు. ఏపీలో ఉన్న 25 మంది లోక్ సభ ఎంపీలు..11 మంది రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపే. అందరు బీజేపీతో కూటమి గట్టిన వాళ్లే. వారి స్వార్థ రాజకీయాలకు బీజేపీతో కూటమి గడుతున్న వాళ్లే. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు.
పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నాం అంటే ఒక్కరు మాట్లాడలేదు. పోలవరం ఎత్తు తగ్గించాం అని చెప్పినా ఐకమత్యం లేదు. రాష్ట్ర ఎంపీలు ఐకమత్యంగా నిలబడితేనే ఏదైనా సాధ్యం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఒక విలువ ఉంది. ఉన్న నాయకులు చట్టసభలు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తున్నారు. చట్టసభలకు ఎన్నికై ఏం లాభం. చట్టసభలకు వెళ్ళాలి.. ఫ్లోర్ ఆఫ్ ది హౌజ్ కోట్లాడాలి
మన రాష్ట్రానికి కావలసిన మేలును సాధించాలి. విశాఖ స్టీల్ భూముల విలువ 4 లేదా 5 లక్షల కోట్లు.
20 వేల ఎకరాల కోసం ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ మోడీ చేపట్టారు. విశాఖ స్టీల్ పై జరుగుతున్నది మొత్తం కుట్రనే.
అందుకే రా మెటీరియల్ ఇవ్వడం లేదు… క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు..లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. గంగవరం పోర్ట్ అదానికి ఇవ్వడం కూడా స్టీల్ ప్లాంట్ కోసం కుట్రనే. విశాఖ స్టీల్ కోన ఊపిరితో ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. ప్రైవేటీకరణ నిర్ణయంలో ఏ మాత్రం మార్పు లేదు అని పార్లమెంట్ వేదికగా చెప్పారు. అయినా కూడా రాష్ట్ర ఎంపీల్లో ఏ చలనం లేదు. మన రాష్ట్ర నాయకులకు బుద్ధి ఉండాలి. మనం ఎందుకు ఎన్నికయ్యాం, ఎవరు ఎన్నుకున్నారు.. మేము ఎందుకున్నాం ఇక్కడ అని ఆలోచన చేయాలి. రాష్ట్ర హక్కుల మీద చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటికే ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండేది. అధికారంలో వచ్చిన ప్రతి ఒక్కరు స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ కి లొంగిపోయారు.
కనీసం ఒక రాజధాని ఉందా అంటే ఆది లేదు. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలు అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. బీజేపీ, టీడీపీ, వైసీపీ, జనసేన ఎంపీలు ఒక వేదిక మీదకు రావాలి. ఇలా వస్తేనే మనం స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మిక సంఘాలు పెట్టిన తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తుంది. స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమంలో కాంగ్రెస్ మీతో కలిసి నడుస్తుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ హయంలో ప్లాంట్ బలోపేతం అయ్యింది.
సొంత మైన్ ఉండాలని ఆ రోజు అనంతపురం లో మైన్ ఇవ్వాలి అనుకున్నారు. నష్టం వస్తే ఒకసారి 2 వేల కోట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ది. నేను స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేశా. పెద్ద ఎత్తున కార్మికులు మద్దతు ఇచ్చారు.
స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది.