(చాకిరేవు)
కట్టలేదు కట్టలేదు అనడం కరెక్ట్ కాదు!
పూర్తైనవి వున్నాయి, నిర్మాణంలో వున్నవి వున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని చూడకండి. దయచేసి దిష్టి పెట్టకుండా చూడండి, కుళ్లుకోకండి.
బ్రహ్మాండంగా కట్టారు!
ఒక్కోటి లెక్కబెట్టండి.. 17 ఉన్నాయో లేదో మీకే తెలుస్తుంది. మావత్వం లేదా? చేసింది చెప్పుకోవడానికి నోట్లో నాలుక లేని మనిషి. సన్మానం చెయ్యాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి, ‘ఏమీ కట్టలేదు’ అనే పచ్చి అబద్ధాలు ఆడడానికి మీకు మనసు ఎలా వచ్చింది?
సమాజాన్ని గంజాయి వనంలా సంస్కరించే ఈ మెడికల్ కాలేజీలు కనిపించడం లేదా?
26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పేద పార్టీ ఆఫీసులకు ఎకరానికి రూ.వెయ్యికి, 33 ఏళ్లు లీజుకి ఇచ్చుకున్న స్థలాలలో నిర్మించాడు. ప్రకాశంలో భవనానికి మాత్రమే అనుమతులు తీసుకొన్నాడు. సమయం లేక మిగిలిన ఏ భవనానికి అనుమతులు తీసుకోలేదు!
ఈ ప్యాలెస్ లన్నీ, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్ఫ్రా సంస్థకు అప్పజెప్పారు. అన్నిటికీ మించి రూ.500 కోట్లతో రిషికొండ మీద నుండి కులుకుతూ చూడడానికి భారీగా కట్టాడు.
కళ్లు తెరుచుకుని చూడండి సామి!