– 23న వస్తానన్న భూమన
తిరుపతి: మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై కేసు నమోదయిన నేపథ్యంలో ఆయనకు అలిపిరి పోలీసులు, 41 ఏ నోటీసులు జారీ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసుల్లో భూమనకు స్పష్టం చేశారు.
అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదయిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల పాటు తాను బిజీగా ఉంటానని ఈసందర్భంగా ఆయన పోలీసులకు చెప్పారు. దానితో వీలు చూసుకుని రావాలంటూ భూమనకు ఎస్ఐ అజిత సూచించారు. వచ్చే సెప్టెంబర్ 23వ తేదీన తాను ఈ విచారణకు హాజరవుతానని పోలీసులకు భూమన కరుణాకర్ రెడ్డి సమాధానం ఇచ్చారు.