తెలుగులో స్వరాలు సమకూర్చిన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక గీతాన్ని పలు భాషల్లో రూపొందించారు. తెలుగులో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చడంతో పాటు సింగర్స్ షగున్ సొధి, ఐరా ఉడుపితో కలిసి పాడటం విశేషం. నదాన్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని ‘టీ సిరీస్’ సంస్థ విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశ అభివృద్ధికి సంబంధించిన విజువల్స్ తో వీడియో రూపొందించారు.