– ‘విశ్వకర్మ కౌశల్ యోజన’ ద్వారా విశ్వకర్మలకు మేలు
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విశ్వకర్మ జయంతి – ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు
హైదరాబాద్: విశ్వకర్మ జయంతి సందర్భంగా, బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఓబీసీ మోర్చా మరియు విశ్వకర్మ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు, హోమం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు సెప్టెంబర్ 17- హైదరాబాద్ ముక్తి దివస్ ను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా ఘనంగా జరుపుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అదేవిధంగా ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం మరియు దేశాన్ని ‘వికసిత్ భారత్’గా మార్చడం లక్ష్యంగా హోమం నిర్వహించబడింది.
మానవ కృషితో పాటు, దైవ అనుగ్రహం అవసరం, గత అనేక సంవత్సరాలుగా కార్యకర్తల కృషితో బిజెపి పార్టీ నిర్మాణం సుస్థిరమైందని పేర్కొన్నారు. విశ్వకర్మలను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్’ గా భావిస్తాం. వారు నిర్మించిన చారిత్రక భవనాలు మరియు స్మారకాలను స్ఫూర్తిగా తీసుకోవాలి.
‘విశ్వకర్మ కౌశల్ యోజన’ ద్వారా విశ్వకర్మలకు మేలు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం గొప్ప పథకాన్ని అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, విశ్వకర్మ జయంతి ఒకే రోజు కావడం ప్రత్యేక సందర్భం.. విశ్వకర్మలను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్’గా, ప్రధాని నరేంద్ర మోదీని ‘డెవలప్డ్ ఇండియా ఆర్కిటెక్ట్’గా ప్రత్యేకంగా అభివర్ణించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ సేవలు, నాయకత్వాన్ని గౌరవిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం.