– హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు?
– కర్ణాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా నిర్వహిస్తోంది
– సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
హైదరాబాద్: నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను.. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని కొన్ని జిల్లాలు కర్ణాటకలో కలిశాయి. అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో అధికారికంగా నిర్వహిస్తోంది.
కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిసాయి. ఈ ప్రాంతంలోని జిల్లా గల తెలంగాణ ప్రాంతానికి చెందిన జిల్లాలు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుతో మహారాష్ట్రలో నిర్వహిస్తున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? హైదరాబాద్ ముక్తి దివస్ ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదు?
ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కానీ, గతంలో గాని, ఇప్పుడు గాని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ ముక్తి దివస్ ను అధికారికంగా నిర్వహించడం లేదు?
ఇంకా ఎందుకు హైదరాబాద్ ముక్తి దివస్ పేరుకు పేర్లు మార్చి, ఈరోజు ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజల పోరాటాన్ని, స్వాతంత్రం కోసం సమర్పించిన అనేక అమరవీరుల త్యాగాలను, ఫలితాలను, ఆకాంక్షలను అవమానం చేస్తున్నారు?
అందుకే, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని బిజెపీ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, గత మూడు సంవత్సరాల క్రితం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ఎలా నిర్వహించబడుతున్నదో, తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించమని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మొదటిసారిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించుకున్నాం. గత 78 సంవత్సరాలుగా హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణం ఏమిటంటే, నిజాం రాజ్యంలో కాసిం రజ్వీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీ స్థాపించబడింది. వారి ప్రైవేట్ ఆర్మీ అయిన రజాకార్లు వందేమాతరం అని నినదించకుండా, త్రివర్ణ పతాకం ఎగరనివ్వకుండా అనేక మందిని ఊచకోత కోశారు. అనేకమందిని హింసించారు.
అందుకే, ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ చరిత్రను, త్యాగాలను, బలిదానాలను, వాస్తవాలను కొన్ని పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతున్నాయి. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించుకుంటున్నాం.
ఓట్ల కోసమే ఈ ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ చరిత్రను వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడుతున్నారు. మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాం కొట్టే ఈ రాజకీయ పార్టీలకు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు.
వచ్చే మూడు సంవత్సరాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, గ్రామ గ్రామాన, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్ద పండుగగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లిబరేషన్ డే, హైదరాబాద్ విముక్తి ఉత్సవాలు నిర్వహిస్తాం.
గత 11 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా, ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏ ఒక్కరోజు కూడా హాలిడే తీసుకోకుండా పనిచేస్తున్న నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ , మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ , కల్చర్ సెక్రటరీ వివేక్ అగర్వాల్ , సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ , హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్ అధికారులు, పోలీస్ అధికారులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.