– ఆ ముగ్గురి వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవాలు
– ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆగ్రహం
విజయవాడ: విజయవాడ ఉత్సవ్ పై అవాస్తవ ఆరోపణలు చేస్తూ… అడ్డుకోవాలని చూస్తున్న ఉమ్మడి కృష్ణ జిల్లాలో వైసీపీకి చెందిన ఆ ముగ్గురు నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. కబ్జా కోరులను బాయ్ కాట్ చేయాలి… దేవాలయ ఆస్తులు ధ్వంసం చేసినోళ్లని బాయ్ కాట్ చేయాలని, వీధి రౌడీలు, గూండాయిజం చేసిన వాళ్లందర్నీ బాయ్ చేయాలని ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. ప్రజలు స్వాగతిస్తున్న విజయవాడ ఉత్సవ్ ను బాయ్ కాట్ చేయాలంటున్న ఆ భూ కజ్జా దారులు, భూ బకాసురులకు ప్రజలే గుణపాఠం నేర్పుతారని ఎంపీ అన్నారు.
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని ఫార్చ్యూన్ మురళి హోటల్లో మంగళవారం విజయవాడ ఉత్సవ్ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు. నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తలపెట్టిన విజయవాడ ఉత్సవ్ పై, తనపై వైసీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి వల్ల 130 దేవాలయాలు ధ్వంసం అయ్యాయయిన, అమ్మవారి విగ్రహాలు చోరీ అయ్యాయని తెలిపారు. దేవాలయాల ఆస్తులు కబ్జా అయ్యాయని, అలాంటి చరిత్ర హీనుడికి విజయవాడ ఉత్సవ్ పై మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక రెండో వ్యక్తి వాళ్ల కుటుంబం విజయవాడ లో కబ్జా చేయని వీధి లేదన్నారు. ఉంటున్న ఇంటి తో పాటు పక్కన ఉన్న స్కూల్ ను ఆక్రమించుకున్నారన్నారు. కబ్జాలు, రౌడీయిజం చేసే ఆ రెండో వ్యక్తి అవాస్తవాలు మాట్లాడటం తప్ప రాజకీయ పరిజ్ఞానం ఏ మాత్రం లేదన్నారు.
అలాగే మూడో వ్యక్తి బందర్ లో ఉంటాడు. ఈ వ్యక్తికి 2007లో దేవాలయల భూములు కొట్టేసిన ఘన చరిత్ర ఉంది. వీళ్లు మాట్లాడే అవాస్తవ ఆరోపణలకు తాము కాదు, ప్రజలే సమాధానం ఇస్తారని ఎంపీ అన్నారు. తాము విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రజా ఆకాంక్షల మేరకు, ప్రజా అవసరాల కోసం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేసే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ఈ ఉత్సవ్ చేస్తున్నట్టు చెప్పారు. కబ్జాలు, ఖూనీ కోరులు మాట్లాడే మాటలు, అవాస్తవ ఆరోపణలు పట్టించుకోనక్కర్లేదన్నారు.
బ్లూ మీడియా పత్రిక తమ పేర్లు ప్రస్తావించకుండా వార్తలు ప్రచురిస్తుంది. గతంలో అవాస్తవాలు రాసినందుకు ఆ పత్రిక పై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు… తన పేరు రాస్తే పరువు నష్టం దావా వేయటానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.
దసరాను పురస్కరించుకుని విజయవాడకు లక్షలాది మంది ప్రజలు, భక్తులు, పర్యాటకులు వస్తారని ఈ సమయంలో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ వల్ల వేలాది మంది చిరు వ్యాపారులు ఎంతో ఉపయోగం కలుగుతుందని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు తమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, ఘంటసాల సంగీత కాళాశాలలో మాత్రమే జరుగుతాయని, గొల్లపూడి లో విజయవాడ ఎక్స్-పో.. అది వేరన్నారు. విజయవాడ ఉత్సవ్ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతుందని, గొల్లపూడిలో ఏర్పాటు చేసే విజయవాడ ఎక్స్-పో తర్వాత కూడా ఉంటుందని తెలిపారు. విజయవాడ ఉత్సవ్ లో ఎక్కడా సినిమా పాటలు ఉండవని తెలిపారు.