– ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన పీబీ సిద్ధార్థ, ఆర్విఆర్ జేసి, విజ్ఞాన్
అమరావతి ( ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జిరోధా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియాస్ ప్రీమియర్ ఫైనాన్స్ క్విజ్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమం డా. హెచ్. హెచ్. డైక్మన్ , డా. ఎస్. జాన్ డేవిడ్ ఆడిటోరియంలో బుధ వారం జరిగింది. దేశంలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి 92 జట్లలో 276 మంది విద్యార్థులు పాల్గొనడం ప్రత్యేకతగా నిలిచింది.
కఠినమైన పోటీల అనంతరం పి.వి.పీ. సిద్ధార్థ కళాశాల ప్రథమ బహుమతిని రూ.12,000తో గెలుచుకోగా, ఆర్వీఆర్ , జె.సి. ఇంజనీరింగ్ కళాశాల ద్వితీయ బహుమతిని రూ.9,000తో సాధించింది. విజ్ఞాన్ యూనివర్సిటీ రూ.3,000 తృతీయ బహుమతి గెలుచుకుంది. అదనంగా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (యూజీ ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఎంబీఏ), విజ్ఞాన్ యూనివర్సిటీ జట్లు ఉత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాయి.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, గౌరవ అతిథులు హాజరై విద్యార్థులను అభినందించారు. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ రామినేని శివరామ్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. నిర్వాహకులు మాట్లాడుతూ, విద్యార్థుల ఉత్సాహం ఎంతో ప్రశంసనీయమని, ఇలాంటి పోటీలు యువతలో ఆర్థిక అవగాహన పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.