– ముస్లిం గ్రేవ్ యార్డ్ ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 125 ఎకరాలు
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
– జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో గ్రేవ్‌యార్డు సమస్య పరిష్కరించాలని ముస్లిం మత పెద్దలతో కలిసి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
– బీఆర్ఎస్ పార్టీ తరపున వినతిపత్రం
హైదరాబాద్: 2 ఎకరాల 16 గుంటల ప్రభుత్వ భూమిని ముస్లిం గ్రేవ్ యార్డ్ కు ఇవ్వాలని కోరాం. గ్రేవ్ యార్డ్ లేక బోరబండ, యూసఫ్‌గూడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ముస్లిం గ్రేవ్ యార్డ్ ల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 125 ఎకరాలు ఇచ్చింది.
గ్రేవ్ యార్డ్ లు అడిగిన ముస్లింలపై అక్రమంగా కేసులు పెట్టారు. కేసీఆర్ పాలనలో ముస్లింల సమస్యలు పరిష్కరించాం. ప్రభుత్వం జూబ్లీహిల్స్ ఎన్నికల కోడ్ వచ్చే లోపు ముస్లిం గ్రేవ్ యార్డు భూమిని కేటాయించాలి. బోరబండలో అమాయక ప్రజలపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కితీసుకోవాలి.గ్రేవ్ యార్డు అనేది ప్రతి ఒక్కరికి చివరి ప్రస్థానం.