హైదరాబాద్: బీఆర్ఎస్ బిఫారంపై గెలిచి కాంగ్రెస్ తీర్థం తీసుకున్న జగిత్యాల సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి లకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. మరిన్ని ఆధారాలు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు కూడా నోటీసులు జారీ చేశారు.