అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శనివారం ఢిల్లీ పర్యటించనున్నారు. న్యూఢిల్లీలోని ఓక్ హాల్ లో జరిగే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత స్కోచ్ అవార్డును అందుకోనున్నారు. మెగా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ ఉచిత శిక్షణ అందజేసిన విషయం విదితమే.
బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహించిన శిక్షణా కేంద్రాల్లో 1,674 మంది, ఆన్ లైన్ ద్వారా మరో 4,774 మందికి ఇలా మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ అందజేశారు.
శిక్షణ పొందిన వారిలో 241 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారు. విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ అందజేయగా, వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ – 1కు పది మంది ఎంపికయ్యారు. ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారు. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో మరో ఆరుగురు, ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికయ్యారు. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు మరికొందరు అర్హత సాధించారు.
బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందజేసినందుకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు బీసీ సంక్షేమ శాఖకు వరించింది. న్యూఢిల్లీలోని ఓక్ హాల్ లో జరిగే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత స్కోచ్ అవార్డును అందుకోనున్నారు. ఇందుకోసం ఆమె న్యూఢిల్లీకి శుక్రవారం రాత్రి పయనమయ్యారు. మంత్రి సవిత వెంట బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.