– పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం.
– ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో విద్యా, వైద్య రంగాలను బలోపేతం చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు
సీడ్స్ ఇంపాక్ట్ , సుజనా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులకు భవాని పురం ఎన్డీఏ కార్యాలయంలో స్కాలర్ షిప్ లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, సీడ్స్ ఇంపాక్ట్ ఫౌండర్ విశ్రాంతఐ ఏ ఎస్,ఆర్ సీ ఎం రెడ్డి పాల్గొని విద్యార్ధిని, విద్యార్ధులకు స్కాలర్ షిప్ లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. పేదరికం కారణంగా అనేక మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు చదువు మధ్యలో ఆపకూడదనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్, సీడ్స్ ఇంపాక్ట్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉపకార వేతనాలను అందజేస్తున్నామన్నారు.
ప్రభుత్వంతో పాటు సీ ఎస్ ఆర్ ఫండ్స్, సుజనా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నిస్తున్నామని తెలిపారు. గత 12 ఏళ్లుగా , సేవా భావంతో విద్యార్థుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న సీడ్స్ ఇంపాక్ట్ ఫౌండర్ , విశ్రాంత ఐ ఏ ఎస్ ఆర్ సీ రెడ్డి ని సుజనా చౌదరి అభినందించారు.
సుజనా చౌదరి ఆదర్శం: ఆర్ సీ రెడ్డి
పశ్చిమాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతూ ఎమ్మెల్యే సుజనా రోల్ మోడల్ గా నిలుస్తున్నారని సీడ్స్ ఇంపాక్ట్ ఫౌండర్ ఆర్ సీ రెడ్డి అన్నారు. విజన్ తో ముందడుగు వేస్తూ సేవలందిస్తున్న సుజనా చౌదరితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు
నెల్లూరు లో మొదలైన సీడ్స్ ఇంపాక్ట్ ప్రస్థానం దేశం నలుమూలల విస్తరిస్తూ అనేక వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు. సుజనా చౌదరి ఆదేశాల మేరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో సేవలందిస్తున్నామన్నారు.
విజయవాడ పశ్చిమ లో 34 మంది విద్యార్థిని విద్యార్థులకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో 320 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 2 లక్షలు చొప్పున ఉపకార వేతనాలను అందజేశామన్నారు. ఎల్వీ ప్రసాద్ ఐ ,ఇన్స్టిట్యూట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి అద్దాలను అందజేశారు.
సుజనా చౌదరి, ఆర్ సీ రెడ్డి సమక్షంలో సీడ్స్ ఇంపాక్ట్ సీ ఈ ఓ పురుషోత్తం, సుజనా ఫౌండేషన్ ఆపరేషన్స్ హెడ్ వీరమాచనేని కిరణ్ ఏం. ఓ .యు పత్రాలను మార్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, జనసేన పార్టీ 42 వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష సురేష్,సీడ్స్ ఇంపాక్ట్ సిబ్బంది వేణు, రాము, సుజనా ఫౌండేషన్ సిబ్బంది హరీష్, చింతా సృజన్ (బాబీ)
జీ ఎన్ ఆర్ ఎం సీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవి కుమార్, కూటమి నేతలు పాల్గొన్నారు.