– మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విజ్ఞప్తి
హైదరాబాద్: కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసి, ఎన్నికల సమయంలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాని దుస్థితిని వివరించారు. కల్లుగీత కార్మికులు 20 నెలలుగా హామీల అమలుకై ఎదురుచూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మద్యం దుకాణాలలో 25% వాటా టీసీఎస్ సంఘాలకు కేటాయించడం. ప్రమాద మరణాలపై కుటుంబాలకు ₹10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు. జీవో 560 ప్రకారం 5 ఎకరాల సాగు భూమి కేటాయింపు. రాష్ట్ర స్థాయి Toddy Tappers Federation ఏర్పాటు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉందన్నారు.