కాకినాడ, కొప్పవరం: ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శుక్రవారం తమ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. శుక్రవారం నిర్వహించిన 22వ ప్రజాదర్బార్ లో 31వినతులు స్వీకరించగా, అందులో 5 సమస్యలను వెంటనే పరిష్కరించారు. మిగతావి సంబంధిత అధికారులకు పంపి త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు చేపట్టినట్లు కార్యాలయ ఇంచార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి తెలిపారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్ లు మాట్లాడుతూ “ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు తరలివచ్చి వారి సమస్యలపై అర్జీలను అందించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజలు అందించిన అర్జులను క్షుణంగా పరిశీలించి వాటిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లి అప్పటికప్పుడే కొన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు. అధిక శాతం నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ దరఖాస్తులు చేసుకుంటున్నారు.
అలాగే ఆరోగ్యం సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కూడా అర్జీలను వస్తున్నాయని వాటిని కూడా పరిష్కరించడం జరుగుతుందని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు , DRUCC సభ్యులు ముత్యాల అనిల్,, జున్నూరు బాబ్జి, సిరియాల కొండబాబు,కాకరపల్లి చలపతిరావు,, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.