– ఉత్తర్వులు జారీ
* పదోన్నతుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ
* మంత్రి సవిత ఆదేశాలతో ఎట్టకేలకు కదలిక
* పీజీటీలుగా 16 మందికి, ప్రిన్సిపాళ్లుగా 14 మందికి ప్రమోషన్
* ఉద్యోగుల్లో ఉప్పొంగిన ఆనందం
అమరావతి: ఎంజేపీ గురుకులాల్లో పదోన్నతుల సందడి నెలకొంది. 30 మందికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత జోక్యంతో ఎట్టకేలకు ఉద్యోగులకు న్యాయం కలిగింది. గత కొన్నేళ్ల నుంచి ఎంజేపీలో పదోన్నతులు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి సవిత దృష్టికి ప్రమోషన్ల విషయమై అధికారులు తీసుకొచ్చారు. సాధ్యా సాధ్యాలను పరిగణలోకి తీసుకుని తక్షణమే పదోన్నతులకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి మరుగునపడిన పదోన్నతుల ఫైల్ కు కదలిక వచ్చింది. టీజీటీగా పనిచేస్తున్న 16 మందికి పీజీటీలుగా ప్రమోషన్ కల్పించారు. పీజీటీలుగా పనిచేస్తున్న 14 మందికి ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పించారు.
ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎంజేపీలో ప్రమోషన్ల సందడి నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పదోన్నతులు రావడంపై 30 మంది టీజీటీ, పీజీటీ ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. మంత్రి సవితకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారు ధన్యవాదాలు తెలిపారు.