– మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేయాలి
– బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ డిమాండ్
హైదరాబాద్ : ప్రజా పాలన మాటల్లోనే … చేతల్లో రాజరికపు పాలన నడుస్తోంది… ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు పరిపాలన చేస్తేనే ప్రభుత్వం ఉంటుంది.. రాష్ట్రంలో స్థానిక సంస్థల గడువు ముగిసినా ఎన్నికలు పెట్టలేదని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ విమర్శించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
అడవిబిడ్డ సీతక్క పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 20నెలలు నుంచి ఎన్నికలు పెట్టలేని అసమర్థ స్థితిలో సీతక్క ఉన్నారు. మంత్రి పదవికి సీతక్క రాజీనామా చేయాలి. ఎంపీటీసీ, జెడ్పిటిసి పదవీకాలం ముగిసింది.
ఎన్నికలు పెట్టకుండా రేవంత్ రెడ్డి సామంతరాజులను నియమిస్తారా? ప్రభుత్వంలో అసమర్థ మంత్రులుగా ఉండి ఏం చేస్తారు…?
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దాచుకోవడానికి పరిమితం అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నచోట కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీలకు ప్రోటోకాల్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు తప్పదు. తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్ లో సీనియర్ మంత్రి. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా తుమ్మల ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఒక్క బీజేపీలోనే చేరలేదు.
సహకార సంఘాలకు ఆరు నెలల పదవీకాలం పొడిగించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో ఛైర్మన్ ను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తుమ్మల నాగేశ్వరరావుకు మేము సలహాలు ఇచ్చే స్థితిలో లేము.
హైకోర్టుకు వెళ్తే పాతవారిని చైర్మన్లుగా కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. నిజంగా మీరు మొగోళ్ళు అయితే ఎన్నికలు పెట్టండి.