• దేశంలోనే మొదటిసారిగా మానిఫెస్టోలో బ్రాహ్మణుల సంక్షేమం
• వేదపండితులకు ఇచ్చే సంభావన రూ. 3 వేల నుంచి 6 వేలకు పెంపు
• ధూప దీప నైవేద్య పథకం కింద దేవాలయాలకు రూ. 10 వేలకు పెంచి చెల్లింపు
– రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చి రామ్ ప్రసాద్
విజయవాడ: గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రాహ్మణుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తామని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కలపరుపు బుచ్చి రామ్ ప్రసాద్ తెలిపారు. గొల్లపూడిలోని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారని, అలా నిర్వీర్యం చేసినా బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి అన్ని పథకాలతో పునరుద్ధరిస్తామన్నారు.
గతంలో ఎవరూ బ్రాహ్మణుల సంక్షేమాన్ని పట్టించుకున్నవారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాహ్మణుల సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణుల సంక్షేమాన్ని మానిఫెస్టోలో పెట్టారని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. దేవాలయాల్లో ఆగమ శాస్త్రం ప్రకారం కమిటీలు వేశామని అన్నారు. హిందువుల దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కూడా కమిటీ వేయాలని చూస్తున్నామన్నారు. వెనుకబడిన తరగతుల కాలనీల్లో 1,000 హిందూ దేవాలయాలు కట్టించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశించారని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వదించిన బుచ్చి రామ్ ప్రసాద్ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న బ్రహమణుల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
బ్రాహ్మణుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూత ఇస్తున్నట్టు తెలిపారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు దేవదాయ శాఖ కూడా తన సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణుల పట్ల ఎంతో చేయూతను అందిస్తున్నదని, దేవాలయాల పాలకవర్గంలో బ్రాహ్మణులకు డైరెక్టర్ లుగా అవకాశం కల్పించేందుకు నిబంధనలు కూడా మార్చామని తెలిపారు. వేద పండితుల ఆర్థిక ఇబ్బందులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు సంభావనను అందించామన్నారు.
అర్చక వృత్తిలో ఉన్న బ్రాహ్మణులకు గౌరవ వేతనం రూ. 10 వేల నుండి 15 వేలకు పెంచి అందిస్తున్నాం. ధూప దీప నైవైద్యం కింద రూ. 5 వేల నుండి 10 వేల వరకూ దేవాలయాలకు అందిస్తున్నామం. ధూప దీప నైవైద్యం పథకం క్రింద గతంలో కన్నా క్రొత్తగా 380 ఆలయాలు నిర్మించేందుకు మంజూరు చేశామని తెలిపారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్త శుద్ధి ఉందన్నారు. దేవాలయాల అభివృద్ధికి నిర్వహణకు అవసరమైన నిధులు ఇంకా కావాలన్నా కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి తెలిపారు.
చైర్మన్ ను అభినందించిన వారిలో శాసనసభ్యులు నక్కా ఆనంద బాబు, ఏపి ఎన్ఆర్ఐ చైర్మన్ వేమూరి రవి, ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండి ఎం. చిన్నబాబు, సీఈవో నాగ సాయి, సీనియర్ మేనేజర్ హెచ్. ఆర్. ఎల్. శ్రీనివాస్, తదితర సిబ్బంది ఉన్నారు