– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
విజయవాడ : రేపటి నుంచి ప్రతి ఇంటికి స్వదేశీ, ప్రతీ ఇంటా స్వదేశీ నినాదంతో ఈ ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జరుగుతుంది… అంత్యోదయ సర్వోదయ సిద్ధాంతం అనుసరించి ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉంటుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… స్వదేశీ ఉద్యమం తిరిగి ప్రారంభించాలని మోదీ పిలుపినిచ్చారు. స్వయం సమృద్ధి భారతం వైపు అడుగేయాలని మోదీ పిలుపునిచ్చారు. మన ఆర్థిక ప్రయోజనాల వైపు మనమే అడుగేయాలని మోదీ అన్నారు.
స్వయం స్వతంత్ర ఆర్థిక, రక్షణ, విదేశీ విధానాలు ఉండాలని మోదీ ఆలోచిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బ తినేలా చేసే పనులను బీజేపీ సహించదు. బాధ్యులను శిక్షించే విధంగా కృషి చేస్తాం. ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ జాతీయ కో కన్వీనర్ హెచ్ రాజా. ఆత్మ నిర్భర్ భారత్ ప్రాధాన్యత ఎప్పుడూ ఉంది. స్వతంత్ర ఉద్యమ కాలంలోనూ ఈ ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యత ఉంది.
ఇండియాపై మల్టీ లేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటూ అధిక ట్యాక్సులు అమెరికా వేస్తోంది. అన్ని రంగాలలో అభివృద్ధి రావాలంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అందరికీ తెలియాలి. ట్రంప్ ట్యాక్సులతో భారతదేశానికి వేరే దారి లేదని అనుకుంటున్నారు. అమెరికాకు 7.25% మాత్రమే భారత్ నుంచీ ఎగుమతి అవుతుంది.. భారతదేశంలోనే వినియోగదారులు ఉన్నారు.. 7.25% ఎగుమతి లేకపోతే ఏమీ కాదు.. జీఎస్టీ 2.0 ద్వారా అత్యంత ముఖ్యమైన నిర్ణయం కేంద్రం తీసుకుంది.. 2007 లోనే జీఎస్టీ రావాలని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.. జీఎస్టీ లో నష్టపోకుండా ప్రభుత్వం చూసుకోవాల్సి వచ్చింది. దసరా నుంచే జీఎస్టీ 2.0 ను ప్రకటించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ రాష్ట్ర కన్వీనర్ మట్టా ప్రసాద్, మీడియా ఇంఛార్జి కిలారు దిలీప్, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కో కన్వీనర్ లు అశోక్ రాజు, సూర్య కళ్యాణ్ చక్రవర్తి, ముత్తా నవీన్, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు.
కాగా, అంతకు ముందు రాష్ట్ర కార్యాలయం లో ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ కార్యశాల మాధవ్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా నుండి నలుగురు ప్రతి నిధులు శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇక్కడ శిక్షణ తీసుకున్న ప్రతి నిధులు జిల్లాలో శిక్షణ ఇస్తారు. ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా తమిళనాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ రాష్ట్ర ఇంఛార్జి హెచ్ రాజా, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రతినిధి లు నుద్దేశించి ప్రసంగించారు