– ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో జరుగుతున్న వినూత్నమైన మార్పులకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నుండి ప్రశంసలు దక్కాయి. ప్రపంచ బ్యాంకు, సమగ్ర శిక్షలో అమలవుతున్న సాల్ట్ ప్రోగ్రాం కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వినూత్నంగా అమలవుతున్నాయని, ఈ కార్యక్రమాలు దేశానికే కాకుండా దక్షిణ ఆసియా మొత్తానికే ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ని ప్రశంసించారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో బుధవారం సమావేశమైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం, ఆయన నాయకత్వాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పాల్ ల్యాబ్‌లు, గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, స్కూల్ లీడర్ షిప్ శిక్షణలు బాగా జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యశాఖ కార్యదర్శి కోన శశిధర్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్రిస్టెల్ కౌమే, సౌమ్య బజాజ్, యిన్ విన్ ఖైన్, ప్రియాంక సాహూ, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు
లీప్ కార్యక్రమానికి సాల్ట్ ప్రొగ్రాం ఎంతగానో దోహదపడుతోందని విద్యాశాఖ నారా లోకేష్ చెప్పారు. గ్యారెంటెడ్ ఎఫ్ఎల్ఎన్ కి సాల్ట్ ప్రోగ్రాం ద్వారా జరిగిన ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ పునాది వేయడానికి ఉపయోగపడతాయని అన్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా మూల్యాంకనం చేసి భవిష్యత్తు శిక్షణ కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకుతో భవిష్యత్తు నిర్మాణ కార్యక్రమానికి, భాగస్వామ్యానికి చర్చించడం కోసం మరోసారి సమావేశం అవుతామనిలోకేష్ అన్నారు.
పాల్ ల్యాబ్‌లు – విద్యలో కొత్త ఆవిష్కరణ
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి పాల్ ల్యాబ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థుల్లోని లోపాలను గుర్తించి, వ్యక్తిగతంగా సహాయం చేయడానికి వీలు కలుగుతుంది. దీనివల్ల ఉపాధ్యాయులు మరింత మెరుగైన ప్రణాళికతో బోధించగలుగుతున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎఫ్ ఎల్ ఎన్ గ్యారంటీడ్ పథకం
ఫౌండేషనల్ లెర్నింగ్ అండ్ న్యూమరసీ… అందించే లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. “గ్యారంటీడ్ ఎఫ్ ఎల్ ఎన్ సాధిస్తామని.. అప్పుడు ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్సూచి గా నిలుస్తుంది అని అన్నారు. రాష్ట్రా విద్యాభివృద్ధికి సాల్ట్ – సమగ్ర శిక్ష చేస్తున్న కృషికి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ని, ఎస్పీడీ బి.శ్రీనివాసరావుని, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను అభినందించారు.