– చీపురు పట్టి చెత్తను ఊడ్చిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి!
దర్శి : ఏక్ దిన్ ఏక్ గంట ఏ స్వచ్ఛత హి సేవ సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఉదయం దర్శి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం పరిశుభ్రత కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి చీపురు పట్టి చెత్తను ఊడ్చి పరిసరాల పరిశుభ్రత పై ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రజా భాగస్వామ్యంతోనే పరిశుభ్రత సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డాక్టర్ లక్ష్మీ వివరించారు.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఇంటి పరిసరాల పరిశుభ్రతతో సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఆమె వివరించారు. ఆరోగ్యమైన సమాజంతో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమాలో స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో దర్శి తహసీల్దార్ ఏం. శ్రవణ్ కుమార్, దర్శి ఎంపీడీఓ పి.కల్పన, మున్సిపల్ కమిషనర్ వై. మహేష్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, దర్శి టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్న, ప్రభుత్వ వైద్యశాల డాక్టర్స్, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
ఓజీ సినిమా సూపర్
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా సూపర్ గా ఉందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రశంసించారు. సినిమాను బుధవారం రాత్రి దర్శి పట్టణంలో శ్రీనివాస థియేటర్ లో కుమారుడు అక్షయ్‌తో కలిసి వారు తిలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ… ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజాసేవలోనే కాకుండా తన సహజ శైలిలో సినిమా రంగంలో ప్రజలకు ఒక అద్భుతమైన సినిమాని అందించారు. దసరా పండుగను ముందే ప్రజలకు ఓజీ సినిమాను అందించారన్నారు.
ప్రకాశం కలెక్టర్ రాజాబాబుతో భేటీ
నూతనంగా కలెక్టర్ గా నియమితులైన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుని తెలుగుదేశం పార్టీ దర్శి ఇన్‌ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గురువారం తాళ్లూరు ఎంపీపీ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజబాబుని పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గ సమస్యలపై డాక్టర్ లక్ష్మి కలెక్టర్ తో కొద్దిసేపు చర్చించారు.
ముఖ్యమంత్రివ చంద్రబాబునాయుడు దర్శి పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు ముందుకు తీసుకువెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ తో మాట్లాడారు. పట్టణంలో ఫిల్టర్ బెడ్లను నిర్మాణం పూర్తి చేస్తే మంచినీటి సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుందన్నారు. అదేవిధంగా గ్రామాలకు మంచినీరు వెళ్లే ఫిల్టర్ బెడ్ రూమ్ కూడా త్వరలో పూర్తి చేయాలని కలెక్టర్ ని డాక్టర్ లక్ష్మి విన్నవించారు. అలాగే మరికొన్ని సమస్యలు కలెక్టర్ దృష్టికి ఆమె తీసుకువెళ్ళారు.
ఈ కార్యక్రమం లో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడం వెంకటేశ్వర్ రెడ్డి, మండలంలోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు