– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి : క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నకరికల్లు మండలం నకరికల్లు హై స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఛాంపియన్ షిప్ ఆట్యా -పాట్యా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో సానుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు.
క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడం క్రీడాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. క్రీడల్లో రాణించే క్రీడాకారులకు రాత పరీక్షల్లోనూ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మానసిక ఉల్లాసానికి శారీరిక దారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు.