– చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం
– ఆ సైకో గాడిని కలిసేందుకు నాకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదు
ఈ ప్రభుత్వంలోకూ నాకు అవమానం జరిగింది
-ఎఫ్డీసీ వాళ్లు నాది తొమ్మిదో పేరు వేశారు
– నాటి జగన్-చిరంజీవి భేటీపై అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్య
అమరావతి : హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ వైసీపీ అధినేత-మాజీ సీఎం జగన్పై అసెంబ్లీలో ఒంటికాలితో లేచారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవ్వరూ అడగలేద ని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ సభలో ఎమ్మెల్యే కామినేని చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి బాలకృష్ణ ఆవేశంగా ప్రసంగించారు.
ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే, చిరంజీవి గట్టిగా ఆడిగాక.. జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతో బాలయ్య ఏకీభవించలేదు.
ఆ సందర్భంలో కామినేని మాటలకు అభ్యంతరం వ్యక్తం చేసిన బాలకృష్ణ ‘‘ ఆ రోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరు. చిరంజీవి గట్టిగాఅడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం ఆ సైకో గాడిని కలిసేందుకు నాకు ఆహ్వానం వచ్చినా వెళ్లలేదు . చిరంజీవిని అవమానించారని అనడం వరకూ వాస్తవమే. కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్ట్ లో నా ది 9వ పేరుగా ముద్రించారు. ఎవడాడు ఇలా రాసిందని ఆరోజే తాను సినిమాటోగ్రఫ్రీ మంత్రి కందుల దుర్గేష్ గారిని అడిగా.. అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే ఈ అంశంపై స్పందించా. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి’’ అని స్పీకర్నుద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించారు.