– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కారు
– రేవంత్‌కు బీసీ సంఘాల కృతజ్ఞతలు
హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై బీసీ సంఘాల నుంచి హర్షం వ్యక్తమయింది. రేవంత్‌కు బీసీ సంఘాలు కృతజ్ఞత ప్రకటించాయి.
బీసీ రిజర్వేషన్ల జీఓను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రేవంత్‌రెడ్డి సర్కార్ జీఓ- 09 విడుదల చేసింది . మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
అందులో భాగంగా నేడు ఉదయం తెలంగాణ ఎన్నికల సంఘం సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై ఎస్ఈసీ చర్చించనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఆదివారం తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.