– స్వగ్రామం పెదమద్దాలి, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ: తమ స్వగ్రామం పామర్రు మండలం, పెద మద్దాలి గ్రామంలో కొలువైన భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని మాజీ కేంద్ర మంత్రి , విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి దర్శించుకున్నారు.
ఆలయ ఈ ఓ ,కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు సుజనా కు స్వాగతం పలికారు.. ఆలయంలో ఎమ్మెల్యే సుజనా ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు,స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే సుజనా చౌదరి ని కోరారు.
భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం విష్ణాలయం,అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. తమ తాతయ్య గారి ఊరు పెదమద్దాలి రావడం సంతోషం గా ఉందని ఎమ్మెల్యే సుజనా తెలిపారు.
అనంతరం తమ నాన్న గారు ,తాతయ్య గారు నివసించిన ఇంటికి వెళ్లి పరిశీలించారు.. గ్రామస్తులతో ఆత్మీయంగా మాట్లాడారు… చిన్ననాటి జ్ఞాపకాలను ఎమ్మెల్యే సుజనా గుర్తు చేసుకున్నారు.. ఎమ్మెల్యే తమ గ్రామానికి రావడం తో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.