– సీత రామ లక్ష్మణ ఆంజనేయ దేవాలయ నిర్మాణానికి సహరించండి
– భజన మందిరానికి నిధులు కేటాయించండి
– మంత్రి సవితకు వినతి పత్రం అందజేసిన సోమందేపల్లి బోయ కులస్తులు
పెనుకొండ : రామాయణం రచించిన బోయ వాల్మీకి మహర్షి ప్రపంచానికి సీతారాముల గురించి రామాయణంలో వివరించారని, అటువంటి మహర్షిని గుర్తించాలని అన్నారు బోయ వాల్మీకి కులస్తులు.., శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి సవిత ను కలిశారు.
సోమందేపల్లి మండల బోయ వాల్మీకి కులస్తులు, సోమందేపల్లి మండల కేంద్రంలో తమ కులానికి ఒక ఎకరా భూమి కేటాయించాలని, ఆ భూమిలో సీతారాముడు లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి, భజన మందిరానికి, కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలని మంత్రి సవితకు వినతిపత్రం అందించారు,