– డి.బ్లాక్ నందు పలు సమస్యలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గోరంట్ల
రాజమండ్రి: గ్రామాల్లో పారిశుధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట పంచాయితీ డీ.బ్లాక్ నందు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులను మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి స్థానికలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని, అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఆక్రమణలు తొలగించడం సహజమని, ఆ క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పని జాప్యం అవుతుందని అన్నారు.
నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు బయటకు పోయేందుకు వీలు లేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నామని స్థానిక మహిళలు సమస్యను తెలుపగా, స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తి అయ్యే వరకు మురుగునీరు బయటకు పోయేందుకు సహకరించాలని, నెల రోజుల వ్యవధిలో మొత్తం పనులు పూర్తి అవుతాయని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి డ్రైనేజీ నిర్మాణానికి కావలసిన స్థలాన్ని సర్వే చేసి వెంటనే పనులు పూర్తి చేయాలని అన్నారు.
పారిశుద్ధ్యం విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని, అధికారులను హెచ్చరించారు. అనంతరం సాటిలైట్ సిటీ సి.బ్లాక్ నందు కళ్యాణ మండపం నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డి.ఇ రవికుమార్, ఏ.ఈ సంపత్ కుమార్, వాసిరెడ్డి బాబి, పెండ్యాల రామకృష్ణ, గారపాటి నాగేశ్వరరావు, కొల్లి దుర్గాప్రసాద్, సోమేశ్వరరావు, హీరా సింగ్, చామాండ్రి నాని, ఏఎంసీ డైరెక్టర్ బైరెత్తి సరోజినీ, నిచ్చినకోళ్ల సత్తిబాబు, ఎమ్మెస్సార్ శ్రీను, దారా అన్నవరం, పెంకే కోటేశ్వరరావు, బండారు సత్తిబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.