సమయం, చోటు ఎంచుకుని వచ్చిన ‘మాజీ’ గారు!
అసలు అధికారంలో లేరు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి… తుఫాను వచ్చి, అందరి పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడే రైతుపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే నమ్మాలా?
తుఫాను బాధితులకు కావాల్సింది అధికారిక సహాయం! దాన్ని అడిగే హోదా ప్రస్తుతం ఆయనకు లేదు. మరి ఈ పులివెందుల ఎమ్మెల్యే పర్యటన దేనికి?
తుఫాను / వరద వచ్చినప్పుడు అధికారులతో మాట్లాడటం, కేంద్రంపై ఒత్తిడి తేవడం ముఖ్యమంత్రి పని. ప్రజలకు అండగా నిలబడటం ప్రతిపక్ష నాయకుడి పని. ఈ రెండింటిలో ఏ హోదాలోనూ లేని వ్యక్తి వచ్చి, పొలాల చుట్టూ తిరిగి, పది రోజుల తర్వాత ‘నష్టం’ చూస్తున్నారంటే… ఇది రైతు సంక్షేమం కోసం కాదు, తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కునే ప్రయత్నం!
పెడనలో అంత నష్టం లేదు, కానీ ఈ పెడబొబ్బల డ్రామా ఎందుకు?
భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కోనసీమ, తుఫాను తీరం దాటిన అంతర్వేది గోదావరి, భారీ వర్షం కురిసిన నెల్లూరు జిల్లాల వైపు కన్నెత్తి చూడకుండా… ఎక్కడైతే “ఎక్కువ వర్షం లేదు, వరద లేదు, ముంపులేదు” అని శాటిలైట్ డేటా చెబుతోందో, సరిగ్గా అలాంటి పెడన వైపే ఎందుకు వెళ్లారు?
అక్కడైతే ఇంటికి, హైవేకి దగ్గర. బస్తీల నుండి జనాన్ని తరలించవచ్చు అనే ప్లానే కదా ఇది!
అసలైన లాండ్ఫాల్ ప్రాంతానికి వెళ్తే నిజమైన నష్టాలు కనిపిస్తాయి. అక్కడ తన కార్యకర్తల ‘సెట్టింగ్’ ఉండకపోవచ్చు. అందుకే ఈ ‘సేఫ్ ల్యాండింగ్’ ప్లాన్!
మాజీ సీఎం గారూ, నిజమైన రైతులు కన్నీరు పెట్టింది తుఫాను వచ్చిన రోజు! మీరు ఇప్పుడు కన్నీరు కార్చింది… ఎన్నికల్లో ఇచ్చిన ’11 షాక్’ గుర్తు చేసుకుని, పులివెందులలో కూడా గుండు కొట్టి, సున్నం బొట్లు పెట్టి, చేసిన పరాభావం గుర్తు చేసుకుని!
ఏ రాజకీయ నాయకుడి పర్యటనకైనా తమ పార్టీ కార్యకర్తలు రావడం సహజమే. కానీ, రైతు సమస్యలు వినడానికి వెళ్లిన చోట… అంతా “సీఎం జగన్” అనే నినాదాలు, హడావుడే! ఇది రైతుకు భరోసా ఇవ్వడం కాదు, తమ ‘పెయిడ్ క్రౌడ్’ బలప్రదర్శన చేయడమే!
పొద్దున్నే నోటు పుస్తకాలు ఇచ్చి, నోట్లు పంపి పట్టుకొచ్చి గుమ్మడి కాయల దిష్టి తీయించుకుని పర్యటన విజయవంతం అని చంకలు గుద్దుకుంటున్న చందం చూస్తుంటే.. జనం చీకొడుతున్నారు. వచ్చింది తుఫాను పరామర్శకా.. బలప్రదర్శనకా అని.
రైతు గోడు విని, ప్రభుత్వానికి లేఖ రాయాల్సిన వ్యక్తి… ప్రభుత్వంపై పచ్చి అబద్ధాలు ఆడటానికి, ముఖ్యమంత్రి పై విమర్శలు చేయడానికి, రైతుల భుజాలపై నిలబడి రాజకీయం చేయడానికి ఇంత పెద్ద డ్రామా అవసరమా?
చిత్రాలు చూస్తుంటే పొలంలో ఈయన సాక్షి కెమెరాల కోసం కొంత భాగం ముందే తొక్కి ఉంచి సిద్ధం చేశారా అనే అనుమానం కలుగుతోంది. ఈయన ప్యాంటు పైకి లాగి దిగిన చోట బురద కూడా లేదు. దారిలో పెయిడ్ ఆర్టిస్టుల ఆనందం, జగన్ ఆనందం చూస్తే.. సాక్షి స్క్రోలింగ్ లో జగన్ పర్యటన సూపర్ సక్సెస్ అని చూస్తుంటే, బలప్రదర్శన చేసి డిపాజిట్ కూడా ఇవ్వని తన పులివెందుల పరాభావం తరువాత, పార్టీ ఉనికి కోసం ఈ తుఫాను పరామర్శ డ్రామా చేసినట్లున్నా రు.
మొసలి కన్నీరు, కెమెరాల ముందు నటన వెనుక పార్టీకి ఊపిరి పోసే ప్రయత్నం—ఇది తుఫాను పరామర్శ కాదు, రాజకీయ పునరుత్థానం కోసం వేసిన స్క్రిప్టెడ్ షో. కానీ జనం చూస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు… ఈ డ్రామాకు బూడిద కూడా పడదు! పదకొండుకు కూడా బొక్కపడుద్ది.
– చాకిరేవు