– దీనిపై సీబీఐ విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి
– సీబీఐ ఆధ్వర్యంలో సిట్ విచారణకు సుప్రీం ఆదేశం
– చిన అప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్, ప్రశాంతరెడ్డిల దగ్గర కూడా పీఏగా చేశారు
– మరి వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదు?
– తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు
తాడేపల్లి: ఏడాదిన్నర కాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి వేధించడమే ఏకైక అజెండాగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది మాజీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.
చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావుని టీటీడీ ఈవో గా నియమించారు. ప్రసిద్ధి చెందిన తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యతపై టీటీడీలో చాలా పక్కాగా పరీక్షలు నిర్వహిస్తారు. సుదీర్ఘ కాలంగా దీనికోసం ప్రత్యేకమైన వ్యవస్ద ఉంది. కాంట్రాక్టర్ వద్ద నుంచి వచ్చిన నెయ్యి నాణ్యత నిర్ధారణలో భాగంగా తనిఖీ చేస్తారు.
వాటి శాంపుల్స్ ని లేబ్ కి పంపిస్తారు. అక్కడ నాణ్యతపై అనుమానం ఉంటే మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. అప్పుడు కూడా ఆ నెయ్యి నాణ్యతపై అనుమానం ఉంటే… దాన్ని తిరుమల కొండ మీద చేరక ముందే వెనక్కి పంపిస్తారు. ఒకవేళ నెయ్యి తిరుమల కొండ మీదకు చేరిందంటే.. అన్ని పరీక్షల్లో ఈ నెయ్యి స్వచ్ఛమైనదని తేలినట్టే లెక్క. అప్పుడు లడ్డూ తయారు చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు.
ఆ విధానంలో భాగంగానే 12 జూన్ 2024లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే… ఆ టైంలో ఈవో గా ఉన్న శ్యామలరావు నెయ్యి ట్యాంకర్లను పరీక్షించగా.. అందులో వనస్పతి కలిసిందేమోనన్న అనుమానాలను ఎన్ డీ డీ బీ వాళ్లు వ్యక్తం చేస్తూ.. ఇది పూర్తిగా వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు అని డిస్ క్లైమర్ కూడా రాశారు. ఈ నెయ్యి ట్యాంకులను తిప్పి వెనక్కి పంపించామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.
సీబీఐ విచారణ జరపాలని వైవీ సుబ్బారెడ్డి కోరితే.. సుప్రీం కోర్టు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ వేసి దర్యాపు చేయాలని ఆదేశిస్తూ… భగవంతుడ్ని రాజకీయాల్లోకి లాగొద్దని.. వీటికి దూరంగా పెట్టాలని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లో లాగొద్దని .. కేవలం నెయ్యిలో కల్తీ కలిసిందా?లేదా? అన్నది తేల్చండని చెప్పంది.
చిన అప్పన్న 2018 వరకు వైవీ సుబ్బారెడ్డి దగ్గర పీఏగా పనిచేశారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దగ్గర పనిచేశారు. మరి వాళ్ల పేర్లు ఎందుకు భయటపెట్టడం లేదు? కారణం వాళ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కనే ఉన్నారు.. వారి పార్టీ తరపున ప్రజా ప్రతినిధులు కాబట్టి.. వాళ్ల పేర్లు పత్రికల్లో రాయలు. సిట్ లో వారి పేర్లు కూడా ప్రస్తావించరు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. టీటీడీలో పర్చేజింగ్ కమిటీ ఉంటుంది.
ప్రస్తుతం టీడీపీలో మంత్రిగా ఉన్న కొలుసు పార్ధసారధి ఆ రోజు పర్చేజింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. అలాగే సౌరభ్, చెన్నైకు చెందిన కృష్ణమూర్తి కూడా పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు..వీరి అనుమతితోనే ప్రసాదానికి కావావల్సిన ముడి సరుకులు కొనుగోలు చేస్తారు. వీళ్లందరినీ వదిలిపెట్టి వైయస్సార్సీపీలో కీలకమైన నాయకుడు కాబట్టి.. సుబ్బారెడ్డిని మాత్రమే టార్గెట్ చేసింది. ఆయన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.
నెయ్యిలో కల్తీ జరిగిందా? లేదా? దాని మీద దర్యాప్తు చేయండి అని సుప్రీం కోర్టు చెబితే.. దాన్ని పక్కన పెట్టి వైయస్సార్సీపీలో ఎవరి మీద కక్ష సాధింపు చేద్దాం? ఎవరిని అరెస్టు చేసి జైల్లో పెడదాం అన్నదే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ లక్ష్యంగా మారింది.