తాడిపత్రి: టీటీడీలోని పరకామణి చోరీ కేసు మలుపు తిరిగింది. చోరీ కేసు ఫిర్యాదుదారు సతీశ్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహం తాడిపత్రి రైల్వే ట్రాక్ దగ్గర పడివుంది. సతీశ్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌పై 2023 ఏప్రిల్‌లో టీటీడీ ఏవీఎస్వో ఉన్నప్పుడు సతీశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో రవికుమార్ చోరీ చేసినట్టు సతీష్‌కుమార్ ఫిర్యాదు ఇచ్చారు. టీటీడీ పరకామణిలో రవికుమార్ చోరీ చేస్తుండగా సతీశ్ కుమార్ పట్టుకున్నారు. 2023 మే 30న విజిలెన్స్ అధికారులు రవికుమార్‌పై ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదించారు.