– బీహార్ ఫలితాలు చూసి బేజార్ అయినవారు ఆంధ్రా అభివృద్ధి చూసి మరింత బేజార్ అవ్వాల్సిందే!
బీహార్ ఫలితాల కోసం చకోరపక్షుల్లా ఎదురు చూసి, చివరికి తేలు కుట్టిన దొంగల్లా గప్ చుప్ అయిన ‘మన అసమదీయుల’ సంగతి తెలుసా? దశల వారీగా కూటముల పనితీరును పరిశీలిస్తే, NDA రెండవ దశలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మొదటి దశలో (121 స్థానాలు) దాదాపు 98 స్థానాలు గెలుచుకున్న NDA, రెండవ దశలో (122 స్థానాలు) తమ సంఖ్యను దాదాపు 104 స్థానాలకు పెంచుకుంది, సుమారు 6 స్థానాల ఎక్కువగా నమోదు చేసింది.
దీనికి విరుద్ధంగా, మహాఘటబంధన్ యొక్క పనితీరు రెండవ దశలో క్షీణించింది. మొదటి దశలో దాదాపు 19 స్థానాలు గెలుచుకున్న MGB, రెండవ దశలో కేవలం 17 స్థానాలకు మాత్రమే పరిమితమై, సుమారు 2 స్థానాలను కోల్పోయింది. ఈ గణాంకాలు రెండవ దశలో NDA విజృంభణ, మరియు MGB బలహీనత NDA యొక్క అఖండ విజయానికి మార్గం సుగమం చేసిందని స్పష్టం చేస్తున్నాయి. బీహార్ శాసనసభ ఎన్నికలు 2025లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 243 స్థానాలకు గానూ, NDA ఏకంగా 202 స్థానాలు గెలుచుకుని, ఐదవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
దీనికి విరుద్ధంగా, తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘటబంధన్ (MGB) కూటమి కేవలం 35 నుండి 36 స్థానాలకే పరిమితమై, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయం సుపరిపాలన, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ మరియు నితీష్ కుమార్ యొక్క స్థిరమైన పాలనపై ఓటర్లలో విశ్వాసాన్ని మరోసారి రుజువు చేసింది. తుది ఫలితాల విశ్లేషణలో NDAలోని భారతీయ జనతా పార్టీ (BJP) అత్యధికంగా 89 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించగా, జెడి(యు) (JD(U)) 85 స్థానాలు గెలిచింది. MGB కూటమిలో RJD 25, కాంగ్రెస్ 6 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగాయి.
సింగిల్ సింగినాదాన్ని అబద్దపు ప్రచారంతో గెలిపించి, తానే ఎందుకు సిఎం అవ్వకూడదని పార్టీ పెట్టి, భంగపడ్డం మరో విశేషం. మొదటి దశ పోలింగ్ అయిపోయాక, రెండో దశ ఎన్నికల ప్రచారానికి బీహార్ వెళ్లిన లోకేశ్, ఒకప్పుడు బీహార్‌ను జంగిల్ రాజ్ అనుకొనే వాళ్లం. గత ఎన్నికల్లో మా ఆంధ్రాలో విధ్వంసం అనుభవించాం. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో.. కూటమి పాలనతో ఆంధ్రాలో అభివృద్ధి సాధిస్తున్నాం అని పాట్నాలో దిగి ప్రచారం చేశారు. రెండు రోజులు జాతీయ మీడియా ఇంటర్వూల ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఆ విషయం తెలిసి, ఇక్కడ అసమదీయులు చాలా ఆశలు పెట్టుకొన్నారు. అక్కడ ఎన్డీయే ఓడిపోతుంది లేదా కనీసం ముందుకన్నా సీట్లు తగ్గుతుంది, రెండో దశలో సీట్లు తగ్గుతుంది, లోకేశ్ అడుగు పెట్టాడు ఆడిపోసుకొందాం అని ఆశ పడ్డారు. NDA సంఖ్య పెరిగింది—MGB సంఖ్య తగ్గింది. అసమదీయుల కలలు మాత్రం పూర్తిగా కూలిపోయాయి. ఆశించినట్లు కాకుండా ఎన్డీయే కూటమి మరింత మెరుగ్గా రెండో దశ పోలింగ్ ఫలితాల్లో విజృంభించే సరికి బేజార్ అయ్యి, తేలు కుట్టిన దొంగల్లా గప్ చుప్ అయ్యారు. అలా, బీహార్ ఫలితాలు చూసి బేజార్ అయినవారు—ఇక ఆంధ్రా అభివృద్ధి చూసి మరింత బేజార్ అవ్వాల్సిందే! బీహార్ ప్రజలు చూపించిన సహనం—ఆంధ్రా ప్రజలు చూపించకపోతే, అభివృద్ధి రైలు మళ్లీ జగన్ జంగిల్ రాజ్ స్టేషన్‌కి వెళ్ళిపోతుంది అని, ఇక్కడి ప్రజలు భయపడేలా చేసింది బీహార్ ఫలితాలు.
