భీమవరం: కార్తీక ఆఖరి సోమవారం సందర్భంగా రాయలంలోని శ్రీబాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, లక్షపత్రి పూజ, రుద్రాక్షలతో పూజలు నిర్వహించారు.
డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు , , టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్వామివారిని దర్శించుకున్నారు.
అంతకుముందు మాజీ సర్పంచ్ కోళ్ళ రామచంద్రరావు, వెంకటేశ్వరీ దంపతులు, కోళ్ళ భరత్ ఫణి నరసింహమూర్తి, గీత దంపతులచే గణపతి పూజ, అభిషేకములు, లక్షపత్రి పూజ, కుంకుమ పూజ, రుద్రహోమం, కళ్యాణం నిర్వహించారు. అనంతరం కార్తీక అఖండ అన్నసమారాధను ప్రారంభించారు. వేలాది మంది భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, యర్రంశెట్టి శివకృష్ణ, కోళ్ల సీతారామ్, మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మైలబత్తుల ఐజాక్ బాబు, బర్రె నెహ్రూ, గనిరెడ్డి త్రినాథ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.