– తెరవెనక ఆరెస్సెస్ కృషి అద్భుతం బీహార్ ఎన్నికలలో ప్రతిపక్షాలు విఫలం అవడానికి ప్రధాన కారణాలు:
1.బీహార్ రాష్ట్రంలో 2016 ఏప్రిల్ నుండి మద్య నిషేధం అమలులో ఉంది.
2.RJD తేజస్వి యాదవ్ తన ఎన్నికల ప్రచారంలో తనని గెలిపిస్తే మద్య నిషేధం ని తొలగించి తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పధకాలని అమలు చేస్తానని వాగ్దానం చేశాడు. ఇది వికటించింది, బీహార్ మహిళా సంఘాలు తేజస్వి యాదవ్ మీద మండి పడ్డాయి. గత 9 ఏళ్లుగా తాము ప్రశాంతంగా జీవిస్తున్నామని, తమ భర్తలు తాగుడికి దూరమయ్యారని ఇప్పుడు మద్య నిషేధం ఎత్తివేస్తే మళ్ళీ తాగుడు కి బానిస అయ్యే ప్రమాదం ఉందని భావించారు. బీహార్ మహిళలు గంప గుత్తగా తేజస్వి యాదవ్ కి వ్యతిరేకంగా ఓటు వేశారు.
3.తేజస్వి యాదవ్ మద్య ప్రియులు గంప గుత్తగా తనకే ఓటు వేస్తారని భావించాడు కానీ అలా జరగలేదు.
4.మహా గట్బంధన్ లో సమన్వయ లోపం కూడా మరో కారణం. మొదటినుండి AIIM ఓవైసీ అందరం కలిసి పోటీచేద్దాం అని అంటూ వచ్చాడు. కానీ AIIM కి బీహార్ లో పని ఏంటి? మీ హైదరాబాద్ లో చూస్కోండి అనే విమర్శలు గట్బంధన్ నాయకుల నుండి వచ్చాయి. ఇది సరైన విమర్శ కాదు. చాలా చోట్ల ముస్లిం ఓటర్లు NDA కి అనుకూలంగా ఓటు వేశారు.
5.బీహార్ ఎన్నికల ప్రచారంలో తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ ని ఎందుకు పిలిచినట్లు? బీహారీ లని నీచంగా దూషించిన స్టాలిన్ ని బీహార్ ప్రజలు ఎందుకు క్షమిస్తారు?
6.చిరాగ్ పాశ్వాన్ LJP పార్టీ 2020 ఎన్నికలలో 130 నియోజకవర్గాలలో పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నది. 2020 లో కనీసం 30 చోట్ల JDU, RJD, అభ్యర్థుల ఓట్లని చీల్చగలిగింది.
7.బీహార్ లో పాశ్వాన్ ( పాశ్వాన్ లేదా దుసధ్ అనే కులం దళితుల జాబితాలోకి వస్తుంది. పాశ్వాన్ అనేది ఉర్దూ పదం. పాశ్వాన్ అంటే అంగ రక్షకుడు – బాడీ గార్డ్ ) కులస్థులు 69,43,000 మంది ఉన్నారు. బీహార్ జనాభాలో పాశ్వాన్ లు 5.66% గా ఉన్నారు. అఫ్కోర్స్! బీహార్ తో పాటు జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లలో కూడా పాశ్వాన్ లు ఉన్నారు.
8.చిరాగ్ పాశ్వాన్ LJP పార్టీ కి పాశ్వాన్ యువకుల ఓట్లు చీలే ప్రసక్తి ఉండదు. LJP అభ్యర్థి ఓడిపోతాడు అని తెలిసీ తమ ఓట్లు వేస్తారు తప్పితే ఇతర అభ్యర్థి కి ఓటు వేయరు.
9.చిరాగ్ పాశ్వాన్ LJP చీల్చిన ఓట్ల వల్ల RJD, JDU, కాంగ్రెస్ లకి చెందిన అభ్యర్థులు తక్కువలో తక్కువ 40 నుండి 50 సీట్లలో ఓడిపోయి ఉంటారని అంచనా!
10.చిరాగ్ పాశ్వాన్ LJP ని మహా గట్బంధన్ లో చేర్చుకోవడంలో రాహుల్, తేజస్వి యాదవ్ లు విఫలం అయ్యారు. “చిరాగ్ పాశ్వాన్” కి మర్యాద కావాలి కానీ రాహుల్, తేజస్వి యాదవ్ లు ఆ మర్యాద ఇవ్వరు.
11.చిరాగ్ పాశ్వాన్ 2020,2025 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట తన అభ్యర్థులని పోటీకి పెట్టలేదు. మరి కనీసం 40 మంది RJD, JDU, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోక ఏం చేస్తారు. 2020 లో చిరాగ్ పాశ్వాన్ NDA లో లేడు. ఈ సారి NDA లో భాగస్వామి గా ఉన్నాడు కనుకనే రికార్డ్ మెజారిటీ వచ్చింది.
12.మహా గట్బంధన్ లో భాగంగా తేజస్వి యాదవ్ కావలిసిన దానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు కాంగ్రెస్ కి. కాంగ్రెస్ కి 60 సీట్లు ఇవ్వడం అవసరమా? ఎప్పుడో మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా బీహార్ లో కాంగ్రెస్ వైపు చూసే నాధుడు లేనప్పుడు 60 సీట్లు ఇవ్వడం తేజస్వి యాదవ్ చేసిన అతి పెద్ద తప్పిదం. అసలు బీహార్ లో కాంగ్రెస్ కి ప్రజలని ఆకర్షించే నాయకుడే లేడు. రాహుల్ ని చూసి ఓట్లు వేస్తారా? పైగా కాంగ్రెస్ పోటీ చేసిన 12 చోట్ల తన అభ్యర్థులని నిలబెట్టాడు తేజస్వి యాదవ్. ఆ 12 స్థానాలు NDA ఖాతాలోకి వెళ్లిపోయాయి. బీజేపీ, JDU లు సమన్వయం తో పనిచేసాయి. ముఖ్యంగా బీజేపీ గురుంచి చెప్పాల్సిన అవసరం ఉంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కులం ప్రాతిపదికన జరుగుతాయి అన్నది తెలిసిందే! నితీష్ కుమార్ ప్రభుత్వం మీద అసమ్మతి ఉంటుంది ఖచ్చితంగా. సోషల్ ఇంజనీరింగ్, కులాల సమన్వయం, బూత్ స్థాయి మేనేజ్మెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టింది బీజేపీ! నితీష్ కుమార్ తో కలిసి సీట్లు సర్దుబాటు చేసుకొని చెరొక 110 సీట్లలో పోటీ చేయాలనే నిర్ణయం బీజేపీ దే! బీహార్ అసెంబ్లీ ఎన్నికలని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి.
1.వక్ఫ్ బిల్లు పెట్టిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఆపరేషన్ సిందూర్ తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. ఏ మాత్రం తేడా వచ్చినా రెండిటిని ప్రజలు తిరస్కరించారు అని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి.
2.బీహార్ రాష్ట్రం అతిపెద్ద Gen Z యువత కలిగిన రాష్ట్రం భారత దేశం లో ఉన్న అన్ని రాష్ట్రల కంటే. బీహార్ లో 32.5% మంది Gen Z యువత ని కలిగి ఉంది. రెండవ స్థానంలో జమ్మూకాశ్మీర్ రాష్ట్రం 30.8% Gen Z యువతని కలిగి వుంది. మూడవ స్థానంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 30% Gen Z యువతని కలిగి ఉంది. నాలుగవ స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం 29.2% Gen Z యువతని కలిగివుంది. బీహార్ విషయంలో ఏ మాత్రం ఆశ్రద్ధ చేసినా తేజస్వి యాదవ్, రాహుల్ లు కలిసి Gen Z యువత ని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే అది దానవాలంగా ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్ లకి పాకే అవకాశం ఉంటుంది. So! మోడీజీ బీహార్ మీద శ్రద్ధ ఎందుకు పెట్టారో అర్ధమవుతుంది!
సంక్షేమ పధకాలు:
ముఖ్యమంత్రి మహిళా ఉద్యమి యోజన:- ఈ పధకం కింద బీహార్ మహిళలు వ్యాపారం చేయాలనుకుంటే ఒక్కొక్కరికి 10,00,000/- రూపాయల ఆర్ధిక సహాయం అందుతుంది.
ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన:- ఈ పధకం కింద మహిళలకి ఒకే సారి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాం అందుతుంది ఏదైనా స్వయం ఉపాధి చేపడితే. ఒక వేళ స్వయం ఉపాధి విజయవంతమైతే విడతలవారీగా 2 లక్షల రూపాయల వరకూ ఆర్ధిక సహాయం అందుతుంది.
నారీ శక్తి యోజన:- మహిళలకి స్వయం ఉపాధి కల్పన చేపట్టే క్రమంలో కావాల్సిన శిక్షణ ఇస్తారు ఉచితంగా. అలాగే శిక్షణ పూర్తయిన తరువాత ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో సమాచారం ఇస్తారు.
మహిళా హెల్ప్ లైన్ నుంబర్:- ఎవరైనా మహిళ అత్యవసరంగా సహాయం అవసరమైతే 181 నుంబర్ కి ఫోన్ చేస్తే అవసరమైన సహాయం అందుతుంది. ఈ పధకాలన్నీ ప్రతిష్టత్మకంగా తీసుకొని అమలు చేయడంతో మహిళల ఓట్లు NDA కి పడ్డాయి. తేజస్వి యాదవ్ మద్య నిషేధం ఎత్తివేస్తానని అనకుండా ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండి ఉండేది! మోడీజీ చరిష్మా ని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరూ బీహార్ లో లేరు.
నితీష్ కుమార్ మీద అసమ్మతి ఉన్నా లాలూ ప్రసాద్ యాదవ్ ఆటవిక రాజ్య పాలన ( జంగిల్ రాజ్ పేరుతో ప్రసిద్ధం) ని బీహార్ ప్రజలు ఒప్పుకోవట్లేదు. పైగా నా వారసుడు తేజస్వి యాదవ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించడం ప్రజలు హర్షించలేదు! బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్, కమ్మీ అభిమానులు లాలూ ప్రసాద్ యాదవ్ ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ తో కలవని నిజాయితీ కలిగిన యోధుడు గా కీర్తిస్తున్నారు నిజమా?
1995 లో లాలూ బీహార్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో అప్పటి గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ అయిన కృష్ణయ్య ని నడి రొడ్డు మీద హత్య చేయడం నిజాయితీ నా? అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ జిల్లా కి చెందిన దళితుడు అయిన IAS ఆఫీసర్ కృష్ణయ్య విగ్రహం ఇప్పటికీ గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు మూగగా రోదిస్తుంది. ఇప్పటికీ గోపాల్ గంజ్ ప్రజలు కృష్ణయ్య గారి విగ్రహ సంరక్షణ స్వయంగా వాళ్ళే చూస్తున్నారు. ఇక ప్రసిద్ధి చెందిన బీహార్ పశు గ్రాసం కుంభకోణం అన్యాయంగా లాలూ మీద మోపబడ్డదిట! 1990 వ దశకంలో ధనవంతుల పిల్లలని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం చాలా సాధారణం.
కిడ్నాపుల నుండి తప్పించుకోవడానికి తల్లి తండ్రులు తమ పిల్లలని దక్షిణాది రాష్ట్రాలలో హాస్థల్స్ లో ఉంచి చదివించడం కూడా సాధారణమే అప్పట్లో. ఇక చదువు అయిపోయాక బీహార్ తప్ప ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాలలో స్థిరపడి బీహార్ లో తమ ఆస్తులని అమ్ముకొని తరలిపోయిన కుటుంబాలు ఎన్నో! 2004-2009 వరకూ లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో రైల్వే లో ఉద్యోగం ఇప్పిస్తామని బదులుగా ఇళ్ళు, ఖాళీ స్థలాలని తీసుకొని చివరికి మొండి చేయి చూపాడు లాలూ!
– పది మంది దగ్గర ఇళ్ళు, ఖాళీ స్థలాలు తీసుకొని ఒక్కరికి మాత్రమే రైల్వే లో ఉద్యోగం ఇచ్చాడు లాలూ
– అదీ కూడా నాలుగవ తరగతి పోస్టు.
– లాలూ వల్ల సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ పరిధిలో నాలుగవ తరగతి ఉద్యోగాలు ( Group D )స్థానికులకి దక్కకుండా పోయాయి.
– సదరన్ రైల్వే లో బీహారీ లు ఉద్యోగాలు దక్కించుకున్నారు.
– ఎలాంటి ప్రకటన లేకుండా దొడ్డి దారిలో ఉద్యోగాలు ఇచ్చాడు లాలూ ప్రసాద్ యాదవ్.
– ఇళ్ళు స్థలాలు లాలూ ప్రసాద్, అతని భార్య రబ్రీ దేవి, కొడుకు తేజస్వి డైరెక్టర్ లు ఉన్న కంపెనీ ల పేరిట రిజిస్టర్ అయ్యాయి.
– ఉద్యోగాల పేరిట తీసుకున్న డబ్బు మనీ లాండరింగ్ ద్వారా లాలూ బినామీ అకౌంట్లలోకి వెళ్లాయి.
Railway job for Land scam పేరుతో జరిగిన అక్రమాల మీద CBI, ED లు కేసులు నమోదు చేశాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, తేజస్వి యాదవ్ లు ప్రధాన నిందితులు. లక్షల మంది ఉద్యోగార్థులు కిరోసిన్ దీపాల వెలుగులో రాత్రింపవళ్ళు చదివి రైల్వే లో ఉద్యోగ ప్రకటన వెలువడుతుందని ఆశపడి భంగ పడ్డారు! మరి అందరికీ స్వంత ఇళ్ళు, ఖాళీ స్థలాలు ఉండవు కదా! 90 వ దశకం తరం వాళ్ళు తమ 60వ పడిలో ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్, RJD లకి ఓట్లు వేస్తారా?
తమ పిల్లలనిని NDA కి విరుద్ధంగా ఓటు వేయనిస్తారా? ఇక బీహార్ పశుగ్రాస కుంభకోణం సంగతి మనకి తెలిసిందే! ఈ కేసులోనే లాలు జైలుకెళ్లి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు! కాంగ్రెస్, కమ్మీ ల మరో ఆరోపణ:- బీహార్ లో అభివృద్ధి చేయకుండా బీహార్ నుండి ఇతర రాష్ట్రాలకి పలు రైళ్లు వేసి లేబర్ ని పంపించడానికే మోడీజీ ఆ పని చేశాడు అని. రైల్వే మంత్రులుగా పని చేసిన మమత బెంగాల్ లో, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టారు ఎలాంటి సర్వే చేయకుండా, డిమాండ్ లేని రూట్లలో!
బీహార్ లో 60% మంది టికెట్లు కొనరు. బెంగాల్ లో 50% మంది టికెట్లు కొనరు. 8 వ తరగతి చదివిన తేజస్వి యాదవ్ కి తన రాజకీయ వారసత్వం ఇవ్వడాన్ని బీహార్ ప్రజలు ఎలా ఒప్పుకోగలరు? బీహార్ మహిళలు తమపిల్లలు కిడ్నప్ అవకుండా చూసుకున్నారు NDA కి ఓట్లు వేసి! లాలూ తన వారసుడి ఘోర పరాజయాన్ని కళ్ళారా చూశాడు. ఎంత మంది అమాయకులు తన వల్ల హత్య కావించబడ్డారో, అత్మహత్యలు చేసుకున్నారో, ఎంతమంది ఆడపడుచులు తమ మానాన్ని పోగొట్టుకొని విలపించారో అంటూ లాలూ ఆత్మ విమర్శ చేసుకొని ఉంటాడా? అలాంటిది ఏమీ ఉండని దుర్మార్గపు మనిషి! ముస్లిం ఓటర్లు కూడా తేజస్వి యాదవ్, రాహుల్ ని తిరస్కరించారు.
ముస్లిం ఓట్లు చీలిపోయి NDA కి పడ్డాయి. షరా మామూలుగా రాహుల్ NDA గెలుపుకి సహకరించాడు! 1990 నుండి కాంగ్రెస్ ఎప్పుడూ కూడా బీహార్ లో అధికారంలోకి రాలేకపోయింది! బీహార్ లో కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి జగన్నాధ్ మిశ్రా అదీ 1990 లో! 1990 నుండి ఇప్పటివరకు కాంగ్రెస్ కి అధికారం ఇవ్వలేదు బీహార్ ప్రజలు. RJD కి జూనియర్ పార్టిగా ఉంటూ వస్తున్నది 1990 నుండి! 1990 నుండి 2005 వరకూ మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ కి మళ్ళీ అవకాశం ఇవ్వలేదు బీహార్ ప్రజలు.
2005 నుండి ఇప్పటి వరకూ అధికారం ఇవ్వలేదు RJD కి! అలాంటిది రాహుల్ ప్రచారం చేస్తే గెలుస్తుందా? రాహుల్ పర్యటించిన 158 నియోజక వర్గాలలో ఒక్క సీటు కూడా మహా గట్బంధన్ కి దక్కలేదు! సోనియా ఆలోచన ఎలా ఉంది అంటే మహా గట్బంధన్ ని నడిపించగల సత్తా ఒక్క రాహుల్ కి మాత్రమే ఉంది అని! అందుకే మహా గట్బంధన్ నాయకులు రాహుల్ ని పట్టించుకోలేదు, రాహుల్ వాళ్ళని కూడా పట్టించుకోలేదు! Zen G యువత కి రాహుల్ ఓట్ చోరీ నినాదం నచ్చలేదు! ఒకవేళ ఓట్ చోరీ నిజమే ఐతే రాహుల్ కి అండగా ఉండేవాళ్ళు! తమ తమ ప్రాంతాలలో ఉంటున్న వాళ్లలో స్థానికులు ఎవరు, బయటినుండి వచ్చిన వాళ్ళు ఎవరో Zen G యువత కి తెలియదా? అందుకే మీడియా తప్పితే బీహార్ Zen G యువత రాహుల్ ని సమర్ధించలేదు! పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ట్రాలకి వెళ్లి పనిచేసుకుంటూ బ్రతుకున్న బీహారీ లకి తమ రాష్ట్రం ఎందుకు తమకి ఉపాధి కల్పించలేకపోతున్నదో, దానికి కారణాలు ఏమిటో తెలుసు.
గత పాతికేళ్ల లో మరీ అద్భుతాలు జరగకపోయినా అంతో కొంత అభివృద్ధి జరిగిందని విశ్వసిస్తున్నారు వలస కార్మికులు! ముఖ్యంగా లా & ఆర్డర్ విషయంలో గణనీయమైన మార్పు కళ్ళకి కనిపిస్తున్నది. విద్యుత్ కోతలు లేవు. రోడ్లు బాగుపడ్డాయి. బీహార్ లో పరిశ్రమల స్థాపనకి పారిశ్రామికవేత్తలు సుముఖంగా లేరు ఇప్పటికీ! బయటి వాళ్ళని పక్కకి పెడితే బీహార్ కే చెందిన వాళ్ళు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సుముఖంగా లేరు అన్నది వాస్తవం! ఏమో! ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, మళ్ళీ RJD అధికారంలోకి వస్తే? ఉన్న ఫళంగా తమ సంస్థలని ఇతర ప్రాంతాలకి తరలించాల్సీ వస్తుందనే భయం ఉంది ఇప్పటికీ! నిజానికి IT పరిశ్రమ కి అనుకూలమైన ప్రదేశం బీహార్! ఒక్క మూడు నెలల వేసవి కాలం తప్పితే మిగతా కాలం ఎయిర్ కండిషనింగ్ పెద్దగా అవసరం ఉండని ప్రదేశం! అఫ్కోర్స్! బీహార్ లేబర్ ని చూసి అంతా అలానే ఉంటారు అనే భ్రమ ఉంది కానీ అది నిజం కాదు! బీహార్ ప్రజలు విద్య మీద శ్రద్ధ పెట్టి చాలకాలం అయ్యింది.
విద్యావంతులైన బీహార్ యువకులకి కొదువలేదు ఇప్పుడు. రాహుల్ కి ఇవే చివరి ఎన్నికలు కావొచ్చు ఉత్తరాదిన! ముందు ముందు రాహుల్ పర్యటనకి ఇష్ట పడకపోవచ్చు మహా గట్బంధన్ లోని పార్టీలకి! మరో అయిదు ఓటమిలు నమోదు చేస్తే సెంచరీ కొడతాడు రాహుల్ తన ఎన్నికల ప్రచార ఓటమిలతో! ఇప్పటికే 95 పూర్తయ్యాయి. రాహుల్ ఒక పని చేస్తే రాణిస్తాడేమో! అది నేను తెలివిగల వాడిని అని తనలో తాను అనుకొని దానిని ప్రజల ముందు చెప్పకుండా ఉంటే మంచిది! బీహార్ ఎన్నికల ప్రచారంలో నా తెలివితేటలని చూసి ఓటు వేయండి అని అనడం ప్రమాదం తెచ్చిపెట్టింది! RSS కృషి మరువలేనిది! మహారాష్ట్ర తరహాలోనే బీహార్ లో కూడా RSS ఇంటింటికి తిరిగి NDA అభ్యర్థులకి ఎందుకు ఓటు వేయాలో వివరంగా చెప్పింది! NDA గెలుపుకి కారణం సమిష్టి కృషి! NDA గెలుపుతో సంతోషం కలిగినా ఒక ప్రమాదం పొంచి ఉన్నది అది: AIIM గెలిచిన సీట్లు సీమాంచల్ లోనే! సీమాంచల్ పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రదేశం!
జైహింద్!
