– NDA ప్రభుత్వ సహకారంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం
– 17 నెలల కాలంలో రూ.15 వేల కోట్ల సాయం అందించిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
– ఒవరాల్ కెపాసిటీ యుటిలైజేషన్ ను 17 నెలల్లో 48 నుంచి 79 శాతానికి పెంపు దేశంలో మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో ప్రభుత్వాల ఆర్థిక సాయం
ఆంధ్రుల హక్కు…విశాఖ ఉక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రైవేటైజేషన్ ప్రచారం నుంచి ప్రగతి వైపు ప్రస్థానం సాగిస్తోంది.నష్టాలతో తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్లాంట్ ను ఆదుకునేందుకు 17 నెలల కాలంలో అనేక నిర్ణయాలు తీసుకుంది. మరే పబ్లిక్ సెక్టార్ కంపెనీకీ ఇవ్వని స్థాయిలో వేల కోట్ల ఆర్థిక సాయంతో అండగా నిలిచింది. – కేంద్ర, రాష్ట్రాల సహకారంతో నేడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలోపేతం అవుతోంది. – విశాఖ ఉక్కును గట్టెక్కించేందుకు ఇప్పటికే రూ.11,440 కోట్లు అందించిన కేంద్ర ప్రభుత్వం.
– స్టీల్ ప్లాంట్ ను ఆదుకునేందుకు రూ.3 వేల కోట్ల వరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేవలం 17 నెలల్లో పరిశ్రమకు రూ.15 వేల కోట్ల మేర సాయం. – సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతర సంప్రదింపులతో ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల. స్వయంగా ఉక్కు మంత్రితో పలు మార్లు భేటీ అయ్యి స్టీల్ ప్లాంట్ కు ఆర్ధికంగా సహకారం అందించేలా చేసిన సీఎం చంద్రబాబు.
– స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించడానికి 2024లో రూ.500 కోట్ల ఈక్విటీని, వర్కింగ్ క్యాపిటల్ అడ్వాన్సుగా రూ.1140 కోట్లను విడుదల చేసిన కేంద్రం.ఆర్ధిక చేయూతతో 2024 అక్టోబరులో ప్రారంభమైన రెండో బ్లాస్ట్ ఫర్నెస్, 67 శాతానికి పెరిగిన ఉత్పత్తి సామర్ధ్య వినియోగం – ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపుల మేరకు మరో మారు రూ.9,800 కోట్ల ఈక్విటీ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం – గతంలో తీసుకున్న రూ.1140 కోట్ల రుణాన్ని ప్రిఫరెన్సు షేర్ క్యాపిటల్ గా మారుస్తూ నిర్ణయం – ఈ నిర్ణయంతో ఈ ఏడాది అక్టోబరు నాటికి 80 శాతానికి పెరిగిన ప్లాంట్ సామర్ధ్య వినియోగం.
– ప్రస్తుతం రోజుకు 16,322 టన్నుల హాట్ మెటల్ ను ఉత్పత్తి చేయగలుగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ – 13 వేల మంది రెగ్యులర్ 15 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ సహకారం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. – రాజకీయ సంప్రదింపులతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నిలువరించిన కూటమి ప్రభుత్వం – ప్రస్తుతం 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్న విశాఖలోని ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్ – ఎంఎస్ఎంఈలు, స్థానిక పరిశ్రమలు, ఆటోమొబైల్ విడిభాగాల కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న స్టీల్ ప్లాంట్ – నవరత్న కంపెనీ హోదాతో 2014-15లో రూ.12,958 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ – ఉక్కు మాంద్యం కారణంగా ఆ తదుపరి నష్టాలను ఎదుర్కొన్న విశాఖ ఉక్కు పరిశ్రమ. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా నాడు ఒక్క బ్లాస్ట్ ఫర్నెస్ నిర్వహణకే పరిమితం అయిన విశాఖ ఉక్కు.
– నష్టాల కారణంగా నాడు ఉత్పత్తి సామర్ధ్యాన్ని బాగా కుదించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ. స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్నా కనీసం స్పందించని గత పాలకులు. ప్లాంట్ భూములు అమ్మేందుకు ప్రయత్నాలు. – బొగ్గు సరఫరా సంక్షోభం తలెత్తినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ఇబ్బందులు రాకుండా గంగవరం పోర్టు నుంచి నిరంతర సరఫరా జరిగేలా చూసిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు నుంచే స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేసేలా ప్రణాళిక. – రూ.200 కోట్లకు పైగా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నా నిరంతరం విద్యుత్ సరఫరా. నీటి ఛార్జీలు చెల్లించకపోయినా ఉత్పత్తికి ఇబ్బంది రాకుండా నీటి సరఫరా చేస్తున్న జీవీఎంసీ.
– స్టీల్ ప్లాంట్ రెండేళ్ల పాటు బకాయి పడిన రూ.2400 కోట్లను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు ఉన్నా ప్రతి అంశంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు చర్యలు – 25 ఏళ్ల క్రితమే వాజ్ పేయి ప్రభుత్వంలో దాదాపు రూ. 2800 కోట్లు కేంద్ర సాయంతో నాడు విశాఖ స్టీల్ ను ఆదుకున్న చంద్రబాబు నాయుడు – తప్పుడు ప్రచారాలతో వాస్తవాలు దాచిపెట్టి….కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతున్న రాజకీయ పార్టీలు. – కార్మిక సంఘాల, రాజకీయ పార్టీల పేరుతో విశాఖ స్టీల్ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్న కూటమి. ఎన్డిఎ సహకారంతో విశాఖ స్టీల్ బలోపేతమవుతోంది. ఇక మరింత ప్రగతి సాధిస్తుంది.