– మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను విశాఖ సీఐఐ సమ్మిట్ మార్చింది. ఏపీని పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతగా శ్రమిస్తున్నారో నిరూపించింది…. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన సత్తాను చాటారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారు. మిగిన రాష్ట్రాలకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కట్టాయి.
మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు రావడం ఏపీ పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం. అన్ని కీలక శాఖలతో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపింది. మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వెళ్లడం.. ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం. సీఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించింది. ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చారు.
సదస్సు విశాఖలో జరిగినా పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేశారని మంత్రి అన్నారు.