– రాష్ట్ర ఆర్థిక పురోగతికి బ్యాంకింగ్ రంగం కీలక
– 47 వ త్రైమాసిక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతికి బ్యాంకింగ్ రంగం కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం అవసరమైన పాలసీలను ప్రకటించనున్నట్లు తెలిపారు.
మూడు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా 13 శాతం జీడీపీ పెరుగుదల టార్గెట్ గా 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. SHGలు, MSMEలకు రుణాలు విస్తరించాలని బ్యాంకర్లను కోరుతూ, ఉపాధి-సంపద పెరుగుదలకు ఇవే పునాది అన్నారు. వ్యవసాయ టర్మ్ లెండింగ్, పంట కోత తర్వాతి మౌలిక వసతులకు రుణాలు పెంచడం అత్యవసరమని సూచించారు.
13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం రాష్ట్ర ఆర్థిక పటాన్ని మార్చుతుందని, మౌలిక వసతుల ఫైనాన్సింగ్‌లో బ్యాంకులు మరింతగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. డిజిటల్ పేమెంట్లు, పీఎంజెడీవై, బీమా కవరేజ్‌లో ఉన్న లోటులను త్వరగా భర్తీ చేయాలని చెప్పారు. గ్రామీణ మార్పు, MSME క్లస్టర్లు, అధిక విలువ తయారీ, గ్రీన్ గ్రోత్ ఇవే భవిష్యత్ తెలంగాణకు దారి చూపుతాయని పేర్కొన్నారు.

