హైదరాబాద్: తన మామ, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే గా గెలుపొందిన నవీన్ యాదవ్ మంగళవారం జూబ్లీహిల్స్ లోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అల్లుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ యాదవ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు కావడం వలన మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.