– మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి
మంగళగిరి : విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశనే మార్చేసింది. రెండు రోజుల్లో జరిగిన ఈ కార్యక్రమం ఏపీని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసిన కష్టాన్ని అందరికీ చూపించిందని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్లోబల్ కంపెనీలు ఒకే వేదికపై చేరి ఏపీపై ఆసక్తి చూపడం రాష్ట్రానికి ఒక కొత్త పెట్టుబడి యుగానికి నాంది పలికిందన్నారు. ప్రభుత్వం తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు, 410 అవగాహన ఒప్పందాలు, 7 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేయగా, వాస్తవంలో ఫలితం అంచనాలకు మించి ఉంది.
పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పాలనలో వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల గురించి అప్పట్లోనే వైసీపీ దివంగత నేత గౌతమ్ రెడ్డి అసెంబ్లీలో అంగీకరించారు. ఆ సమయంలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయంటే ఆయన పాలనలో పెట్టుబడులపై విశ్వాసం ఎంత ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు. 610 ఎమ్ఓయూ లు సుమారు 25 లక్షలు (20 లక్షల ఉద్యోగాలు వస్తాయని మేనిఫెస్టోలో చెప్పకుండానే ఇంతకంటే భిన్నంగా 25 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి.
సదస్సు జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 24 బిజినెస్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు. మెక్సికో, ఇటలీ, జపాన్, తైవాన్, యూరప్, న్యూజిలాండ్ వంటి పలు దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం రాష్ట్రంపై ఉన్న గ్లోబల్ ఆసక్తిని తెలియజేస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా వ్యాపారం చేయడం సులభతరం కావడం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనుమతులు మరియు ప్రక్రియలు వేగంగా పూర్తి కావడం. యువనేత నారా లోకేష్ గారు దుబాయ్, లండన్, దావోస్ వంటి ప్రాంతాల్లో పర్యటించి, విదేశీ పెట్టుబడిదారులతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ భారీ పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా గ్లోబల్ క్లౌడ్ ద్వారా 1.3 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. సీఐఐ సదస్సులో వివిధ రంగాలలో గణనీయమైన పెట్టుబడులు వచ్చాయి.
పవర్ లో 1935 కంపెనీలు, రూ.33,000 కోట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ 242 కంపెనీలు, రూ. 80,000 కోట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 382 కంపెనీలు, కోట్లు 2,00,000 ఐటీ-1,60,000, ఏపీసీఆర్డీఏ 48,000 కోట్లు, టూరిజం122 కంపెనీలు 21,000 కోట్లు, ఫుడ్ ప్రాసెసింగ్38 కంపెనీలు 13,000 కోట్లు టెక్స్టైల్స్, ఆరోగ్యం, విద్య, ఇతరలు 4,00,000 పైన పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీనికి నిదర్శనంగా, ఆర్జే గ్రూపు (RJ Group) అధినేత రవి జయపూరియాకు చెందిన అనుబంధ సంస్థ వోల్స్ అండ్ ల్యాబ్స్ గురించి ప్రస్తావించారు. ఆర్జే గ్రూప్ (వరుణ్ బెవరేజెస్, దేవయాని వంటి అనుబంధ సంస్థలు ఉన్నాయి తిరుపతి నాయుడుపేటలో గ్రీన్ ఎనర్జీ కోసం రెండు గిగా యూనిట్లు (ఒక గిగావాట్ పవర్ సేల్ సామర్థ్యం, ఇంకోక గిగావాట్ మాడ్యూల్ సామర్థ్యం) ఏర్పాటు చేయడానికి 1743 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా సుమారు 615 ఉద్యోగాలు వస్తాయి.
కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇవ్వడం, పారిశ్రామికవేత్తలకు మౌలిక సదుపాయాలు (విద్యుత్, నీరు) కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2019-2024లో జగన్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ సమ్మిట్ నిర్వహించినా ఎటువంటి భారీ పెట్టుబడులను తీసుకురాలేకపోయారు. ఆ సమ్మిట్‌లో కేవలం పచ్చళ్లు, నూడిల్స్, కరివేపాకు పొడి, ఫిష్ మార్ట్ వంటి చిన్న ఉత్పత్తులు తెచ్చే కంపెనీలనే తెచ్చారు. చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన కియా, జాకీ అనుబంధ సంస్థలు, సింగపూర్ స్టార్టప్ కంపెనీలు (బీఆర్ సెట్ గ్రూప్స్) వంటి సంస్థలను బెదిరించి రాష్ట్రం నుంచి పారద్రోలారు.
పెట్టుబడులు పెడితే “అంతు చూస్తామని” వైసీపీ నాయకులు బెదిరించారని విమర్శించారు. వైసీపీ పాలనలో విధ్వంసం మాత్రమే జరిగిందని అమరావతి రైతుల బాధలు దీనికి నిదర్శనమన్నారు. అమరావతిని లెజిస్లేటివ్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ అని చెప్పి, ఒక్క రాజధానిని కూడా అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. శతాబ్దాల నుంచి ఆదాయ వనరుగా ఉన్న అమరరాజా వంటి సంస్థలను కూడా పారద్రోలారని విమర్శించారు. వైసీపీ పాలనలో పెట్టుబడులు రాకపోవడం వలన, నిరుద్యోగ రేటు అధికంగా (24 శాతం) ఉంది. నిరుద్యోగం కారణాల వల్ల సుమారు 4100 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది పీరియాడిక్ లేబర్ సర్వేలో కూడా వెల్లడైందన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, యువత చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అంతా గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక, మైన్ దోపిడీ మాత్రమే జరిగిందని విమర్శించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో గంజాయి సరఫరా చేసి రాష్ట్ర యువతను మత్తు రాజధానిగా మార్చాలని ప్రయత్నించారని, విద్యార్థి సంఘం అధ్యక్షులను రంగంలోకి దించడం దీనికి నిదర్శనమన్నారు. కొత్త కంపెనీలు రాకుండా ఎలా అడ్డుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని ఎలా దిగజార్చాలి అనే కంకణం కట్టుకుని పనిచేశారు. మంచి పనులు జరిగితే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం, చెడ్డ పనులు జరిగితే కూటమి ఖాతాలో వేయడానికి ప్రయత్నించడం వంటి కుతంత్రాలను ప్రయోగించారని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని కూటమి ప్రభుత్వం చేస్తోందని నిరూపించడానికి జోగి బ్రదర్స్‌ను రంగంలోకి దించారు. చివరికి నిజం బయటపడిందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానితో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రాష్ట్రంలోని అందరూ బాగుండాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం రాయలసీమలో డ్రోన్, రెన్యూవబుల్ ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లు, టెక్స్టైల్స్ హబ్ ను, కోస్తాంధ్రలో క్వాంటం వ్యాలీ, ఆక్వా హార్టికల్చర్, పెట్రోకెమికల్, విద్య, వైద్య హబ్‌లు గా, ఉత్తరాంధ్రలో డేటా హబ్, ఐటీ, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్ హబ్‌లుగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు.
విజయం చంద్రబాబు నాయుడు గారి విజన్, లోకేష్ గారి కృషి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు ప్రధాని మోడీ గారి సహకారంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఇప్పటికైనా వైసీపీ కూటమి ప్రభుత్వం బుదరజల్లడం మానుకోవాలి లేదంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో 11 సీట్లు కూడా రావన్నారు