– సీఎం రేవంత్ కూడా మొన్న అదే చెప్పారు
– సీనియర్ సాథి రోల్ మోడల్ కావాలి
– తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో ఇది ప్రారంభం కావాలి
– పిల్లలు మంచిగా చదువుకోవాలని త్వరగా హాస్టల్ లో వేస్తున్నారు
– మా కొడుకు చూస్తలేదు..పట్టించుకోవడం లేదు అని ఫిర్యాదులు వస్తుంటాయి
– హైదరాబాద్ కలెక్టరేట్ లో సీనియర్ “సాథి” కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్..
– కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అరుణ్ ,సీనియర్ సిటిజన్స్ సంక్షేమ బోర్డు ప్రతినిధులు..
హైదరాబాద్: సీనియర్ సాథి ప్రారంభించుకున్నందుకు అభినందనలు. కొంతమంది సమయం లేక సీనియర్ సిటిజన్స్ తో చూడలేక కొంత మంది కుటుంబ కారణాలతో సీనియర్ సిటిజన్స్ దూరం పెడుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి.. వృద్ధుల తో ఆ ఇంట్లో వారంతా వారి అనుభవాన్ని పంచుకునేవారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధులు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ అందరికీ అభినందనలు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు మా కొడుకు చూస్తలేదు , పట్టించుకోవడం లేదు అని ఫిర్యాదులు వస్తుంటాయి. సీనియర్ సిటిజన్స్ చట్టం పై అవగాహన కల్పించుకొని, సమాజంలో వృద్ధులు వారి పిల్లలు ఆరాధించేలా ఉంటుంది. సైబర్ క్రైమ్ ఎవరు ఎప్పుడు ట్రాప్ చేస్తారో తెలియదు.దీనిపై అవగాహన కల్పించాలి. హైదరాబాద్ లో స్థాపించిన సీనియర్ సాథి రోల్ మోడల్ కావాలి. తెలంగాణ లోని అన్ని జిల్లాల్లో ఇది ప్రారంభం కావాలి.
ఉపాధి ,విద్య అవకాశాలు ద్వారా దూరంగా ఉన్నపుడు, వీడియో కాల్స్ , మొబైల్ ద్వారా వారితో కమ్యూనికేషన్ లో ఉంటున్నారు. కొంత మంది కావాలని తప్పించుకొని దూరంగా ఉంటున్నారు.చట్టం ద్వారా వారికి శిక్షించి యంగిస్తాన్ లాంటి సంస్థలు వారికి అండగా ఉండాలి. గ్రూప్ 1,2 నియామక పత్రాలు అందజేసే సమయంలో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. మీరు మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మీ జీతాల నుండి కట్ చేస్తామని హెచ్చరించారు. పిల్లలు మంచిగా చదువుకోవాలని త్వరగా హాస్టల్ లో వేస్తున్నారు.
ఆది తర్వాత వారిపై ప్రభావం పడుతుంది. సీనియర్ సిటిజన్స్ కి ప్రభుత్వం అండగా ఉంటుంది. వారికి ఏ ఇబ్బందులు లేకుండా సీరియస్ గా చట్టాన్ని అమలు చేస్తుంది. మా రవాణా శాఖ నుండి యూనిసెఫ్ తో కలిసి రోడ్డు ప్రమాదాలు నివారించడానికి అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం రోడ్డు భద్రత పై సీరియస్ గా ఉంది. రోడ్డు ప్రమాదాల ద్వారా మరణాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద భవనాల నిర్మాణాల్లో కూడా వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపడుతున్నారు. సీనియర్ సాథి కార్యక్రమాన్ని గ్రౌండ్ లోకి తీసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి ఇరిటేషన్ లేకుండా, పేషన్స్ ఉండేలా వారికి ప్రత్యేక అవగాహన తీసుకోవాలి. సీనియర్ సాథి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అరుణ్ కి అభినందనలు.