– విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
సత్తెనపల్లి : డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది… గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగింది… వ్యవసాయం లాభసాటి కావాలి. అన్నదాతల బతుకులు మారాలి అన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం గుడిపూడి గ్రామంలో పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే…
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 90 శాతం అమలు చేశాం. పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు ఇస్తున్నాం. గత ప్రభుత్వం రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించలేదు.. మా ప్రభుత్వంలో రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాం. రికార్డుస్థాయిలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం.. ధాన్యం విక్రయించే రైతుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ తీసుకొచ్చాం. గత ప్రభుత్వం పంటల బీమా కూడా చెల్లించలేదు.
సత్తెనపల్లి నియోజకవర్గం లో 36,752 రైతన్నలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ లబ్ధిదారులకు 24.07 కోట్ల విడుదలయ్యాయి. రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది చంద్రబాబు తెచ్చిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం, కానీ జగన్ హయాంలో రైతు సంక్షేమం కేవలం ఓటు రాజకీయాలకే పరిమితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.20వేలు ఇవ్వనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులు అర్హులుగా అధికారులు గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.14,000. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.6,000 (పీఎం కిసాన్ పథకం కింద). తొలి విడతగా కేంద్రం రూ.2000, రాష్ట్ర వాటా రూ.5000 కలుపుకుని రూ.7000 ఆగస్టు 2వ తేదీన రైతుల ఖాతాల్లో జమ చేశారు.
వైఎస్సార్ రైతు భరోసాతో మోసం
“వైఎస్సార్ రైతు భరోసా” అని హంగామా చేశారు జగన్ రెడ్డి… కానీ వాస్తవానికి అందిన డబ్బులో ఎక్కువభాగం కేంద్రం ఇచ్చినదే. అయినా దాన్ని తన ప్రభుత్వమే పూర్తిగా ఇచ్చినట్టు ప్రచారం చేసి రైతులను మోసం చేశారు.
రైతు భరోసా కింద ఏడాదికి ఒకేదఫాలో రూ.13,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో కలిపి రూ.7,500 మాత్రమే చెల్లించారు. కేంద్రం ఇచ్చే రూ.6వేలను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారు. 64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం 45 లక్షల మందికి కుదించారు.
రైతుల సంక్షేమాన్ని నిజమైన అర్ధంలో కాపాడే పథకం “అన్నదాత సుఖీభవ”. పీయం కిసాన్తో కలిపి ఈ పథకం ద్వారా రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇదే రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం, భరోసా ఇచ్చే పథకం. ఇప్పటికే తొలి విడతలో 7 వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేకంగా గ్రీవెన్స్ మాడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి 20 వరకు వచ్చిన ఫిర్యాదులను అగ్రికల్చర్ అసిస్టెంట్ల ద్వారా పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి రైతు గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంది.
జగన్ హయాంలో పేరుకు మాత్రమే ఇచ్చిన భరోసా కాకుండా, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను అర్థం చేసుకుని, ఒక్కొక్కరికి తగిన విధంగా న్యాయం చేస్తూ ముందుకు సాగుతోంది.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ, విద్యుత్ శాఖ, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు.