– కవిత తీన్మార్ మల్లన్నపై దాడి చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు?
– పార్టీలో ఉన్నప్పుడు లేని తప్పులు ఇప్పుడెందుకు కనిపిస్తున్నాయి ?
– పోలీసులు రోహిన్ రెడ్డి, ఓఎస్డి సశాంత్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
– హైవే పై ప్రమాదాలకు కారణం రేవంత్ రెడ్డే
– రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
– రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, తాటికొండ రాజయ్య
హనుమకొండ: కవిత కు రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తున్నారు. కవిత ఆరోపణల్లో వాస్తవాలు లేవు. ఆధారాలతో సహా బహిరంగంగా చర్చకు సిద్ధమైతెనే నమ్ముతాం. కవిత తీన్మార్ మల్లన్నపై దాడి చేస్తే ఎందుకు కేసులు పెట్టలేదు? పార్టీలో ఉన్నప్పుడు లేని తప్పులు ఇప్పుడెందుకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అన్ని కుట్రలు చేస్తూ, అబద్దాలను నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలకు లీడర్ రేవంత్ రెడ్డి. 700 మంది రైతులు ఆత్మహత్య, వారిని ఓదార్చి,రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు కేటిఆర్,హరీష్ రావు వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే,మంత్రులు పక్కదోవపట్టిస్తున్నారు.
2014 కి ముందు పత్తి ఉత్పత్తిలో తెలంగాణ 10 వ స్థానంలో ఉండేది. కేసిఆర్ సిఎం అయ్యాక రైతు బంధు, రైతు వేదికలు కట్టి ప్రోత్సహించి, 3 స్థానానికి తీసుకొచ్చారు.కేసిఆర్ రైతులకు నిబంధనలు పెడితే ఏనాడు ఒప్పుకోలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. ప్రవీణ్ కుమార్ ఇంకా ఏమన్నారంటే.. 2018 లో వడ్లు కేంద్రం కొనకపోతే డిల్లీ లో ఆరు రోజుల దీక్ష చేసి కేంద్రం మెడలు వంచారు. 2022 లో 10 వేల మందితో 200 బస్సులో వస్తామని హెచ్చరించి రైతులకు న్యాయం చేసి ఆదుకొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ముందు ఎందుకు ధర్నా చేయలేదు? ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనాలనే సిసిఐ నిబంధనకు ఎలా ఒప్పుకున్నారు.
ఎందుకు ప్రశ్నించలేదు? రేవంత్ రెడ్డి హోం మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయాలి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రతి రోజూ రాజ్యాంగం, ప్రజాపాలన,ఇందిరమ్మ రాజ్యం అని చెబుతున్నారు, నిజంగా మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే,మీది ప్రజా పాలన అయితే దళితులను ఎందుకు చంపుతున్నారు? చిలుకూరు పోలీస్ స్టేషన్ లో సిఎమ్ఆర్ఎఫ్ ఫండ్ గురించి అడిగితే కర్ల రాజేష్ అనే దళిత యువకున్ని థర్డ్ డిగ్రీ పెట్టి చంపారు. మృతదేహాన్ని పట్టుకొని రెండు రోజులుగా ధర్నా చేస్తుంటే ఎలాంటి స్పందన లేదు.
అందుకు కారణమైన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎర్ర రాజశేఖర్ అనే దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకుంటే,అమ్మాయి కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం ఉందని ఫిర్యాదు చేసినా,పోలీసుబు పట్టించుకోకపోవడంతో హత్య గురయ్యారు. కానీ మంత్రి కొండా సురేఖ కూతురు, సుష్మిత టాస్క్ ఫోర్స్ పోలీసులతో మాట్లాడుతూ బహిరంగంగా, రోహిన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి పంపితే వచ్చి తుపాకి పెట్టి బెదిరించాడు అని చెప్పింది.
మరి టాస్క్ ఫోర్స్ పోలీసులు రోహిన్ రెడ్డి, ఓఎస్డి సశాంత్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? హోం మినిస్టర్ రేవంత్ రెడ్డి దళిత యువకులకు ఎందుకు న్యాయం చేయడం లేదు? ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాం,ఫ్రీ బస్ అమలవుతుందని చెప్తున్నారు కానీ, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం, డ్రైవర్ల మానసిక వేదన వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. చేవెళ్ల రోడ్డులో గరిగిన ప్రమాదంలో 24 మంది మరణం, హైదరాబాద్ – వరంగల్ హైవే పై ప్రమాదాలకు కారణం రేవంత్ రెడ్డే. రోడ్లు వేయించడం, బస్సుల సంఖ్య పెంచడం, ఆర్టీసీ సిబ్బందిని పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. చేవెళ్ల కు నాలుగు లైన్ల రోడ్డు వేయాలని ప్రజలంతా డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు.
కానీ కల్వకుర్తి ఏరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులకు వేల ఎకరాల్లో అభివృద్ధి చేయడానికి 6 లైన్ రోడ్డు వేయడం కోసం 4 వేల కోట్ల విలువైన కాంట్రాక్టు బిజెపి ఎంపి సిఎం రమేష్ కు ఇచ్చారు. విద్యారంగంలో కూడా కాంగ్రెస్ పాలనలో 8 వేల కోట్లు బకాయి పడ్డాయి. చరిత్రలో మొదటిసారిగా ప్రైవేట్ కాలేజీలు బంద్ అయ్యాయి.
కేసిఆర్ పాలనలో ఇలా ఎనాడూ జరగలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు 110 మంది విద్యార్థులు మరణించారు. ఇటీవల టీచర్లు లేరని విద్యార్థులు రోడ్ల మీదికి వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పాలనకే దక్కుతుంది. ఏం సాధించారని ప్రజాపాలన వారోత్సవాలు? వచ్చే నెల డిసెంబర్ 8,9 లో ప్రజాపాలన వారోత్సవాలు వంద ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో 3 వేల మంది పోలీసుల బందోబస్తు మధ్య జరపనున్నారు. ఇది అతిపెద్ద ద్రోహం మరియు జోక్. కాంగ్రెస్ 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు? ఏం అభివృద్ధి చేశారో ఎక్కడైనా చర్చకు రెడీ అంటూ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి 1.72 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. మరి తెలంగాణలో ఒక్క కంపెనీ ఐనా ప్రారంభించారా? కేసిఆర్ గతంలో అప్పు చేసి కాళేశ్వరం కట్టారు. సెక్రటేరియట్ కట్టారు. వైద్య కళాశాలలు కట్టారు. లక్షలాది మంది విద్యార్థుల కోసం గురుకులాలు పెట్టి ఉచితంగా విద్యను అందించారు. తెలంగాణ ప్రజలందరిని మోసం చేసి,అబద్దాలు చెపుతూ,కుట్రలు చేస్తున్నందుకు నైతిక బాధ్యత వహించి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. అప్పుడే తెలంగాణకు పట్టిన శని పోతది.