– ఏసీబీకి అనుమతి మంజూరు చేసిన తెలంగాణ గవ ర్నర్ జిష్ణుదేవ్ వర్మ
– కేటీఆర్‌పై చార్జిషీటుకు ఏసీబీ సిద్ధం
హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు ఏసీబీకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఫైలుపై ఆయన సంతకం చేస్తూ, కేటీఆర్‌పై విచారణకు అనుమతి మంజూరు చేయడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్‌పై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఏసీబీ అధికారులకు మార్గం సుగమమయింది. విచారణ అనంతరం ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఏసీబీ భావి స్తున్నట్లు సమాచారం.
అరవింద్ కుమార్‌పైనా… ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం డీవోపీటీకు లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ అభియోగాలు నమోదు చేయనుంది.ఈ- రేసు అంశంలో అరవింద్ బిజినెస్రూల్స్ను అతిక్రమించి, కేవలం కేటీఆర్ నోటిమాటగా ఇచ్చిన ఆదేశాలను పాటించారన్న ఆరోపణ లున్న విషయం తెలిసిందే.