గత ఏప్రెల్ 8న అప్పటి సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులు J B Pardiwala and R. Mahadevan తమిళ్ష్నాడు గవర్నర్ రవి విషయంలో ఆయన వ్యవహార శైలి ‘erroneous and illegal’ అన్నట్టు భావించి సుప్రీంకోర్టు రాష్ట్రపతి కి గవర్నర్స్ కు పార్లమెంట్, శాసనసభ పాస్ చేసిన బిల్లులపై ఆమోదం లేదా తిరస్కరణ నిర్ణయాలకు కాల పరిమితి విధిస్తూ, విధించిన కాల పరిమితి లోగా గవర్నర్ నిర్ణయం తీసుకోక పోతే అటువంటి బిల్లులు పాస్ అయినట్లుగా పరిగణనించ బడుతాయి అని సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించారు. ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అధికారంతో అప్పట్లో మాననీయ ధర్మాసనం తీర్పును చెప్పింది.
ఆర్. మహాదేవన్ అన్న జడ్జ్ తమిళ్ష్ వ్యక్తి. అయన కుటుంబం చెన్నైలో నివశిస్తోంది. ఈ తీర్పు తమిళ్ష్నాడు గవర్నర్ విషయంలోనే వచ్చింది. తమిళ్ష్నాడు ప్రభుత్వం కోసమే అత్యుత్సాహంతోనే వచ్చింది అని కొందరు పెద్దలు సరైన తెలివిడితో చెప్పారు. ఈ ఆర్టికల్ 142 కింద సుప్రీమ్ కోర్టుకు ఉన్న అధికారం ప్రశ్ననీయం కాదు. కానీ ప్రధాన రాజ్యాంగం ప్రకారం గవర్నర్, రాష్ట్రపతి అత్యున్నతమైన వాళ్లు. రాజ్యాంగం ప్రకారం వాళ్ల అధికారం అన్నిటికీ అతీతమైంది కాదా? గవర్నర్, రాష్ట్రపతి విషయంగా ఆర్టికల్ 142 వర్తిస్తుందా? గవర్నర్ విషయంలో ఆర్టికల్ 142ను వర్తింపజేయడం ప్రశ్ననీయం కాదా? రాష్ట్రపతి, గవర్నర్లపై సుప్రీమ్ కోర్ట్ అధికారం చెయ్యగలదా? అని ఏప్రెల్ 9న ఒక పోస్ట్ పెట్టాను.
ఆ పోస్ట్ లింక్: www.facebook.com/share/p/1WPFdztfVy/ దక్షత, బాధ్యత, సరైన పనితీరు, దేశ సంక్షేమంపై దృష్టి, రాష్ట్ర పాలకుల అవినీతిని అదుపు చెయ్యాలన్న సత్సంకల్పం ఉన్న రాష్ట్ర గవర్నర్లకు ఆ తీర్పు పెనుఘాతమూ, విఘాతమూ అవనుందేమోనని ‘మామూలు’ దేశ పౌరులకు భయం వేసింది. అధికరణం 142 కింద గవర్నర్లు దక్షతతోనూ, బాధ్యతతోనూ పనిచెయ్యడాన్ని నిరోధిస్తూంటే వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో దేశ హానికర పరిణామాలు విచ్చలవిడిగా చోటు చేసుకుంటాయని దేశ పౌరులకు భయం కలగదా? ‘రాజ్యాంగ బద్ధమైన గవర్నర్, రాష్ట్రపతి స్థానాలకు, అధికారాలకు, తీరుకు, స్థాయికి ఎటువంటి ఎప్పటికీ భంగం కలగకూడదు’ కాబట్టి కేంద్ర ప్రజా ప్రభుత్వం ఈ తీర్పు పై Full Costitution 7 member benchలో revision pettition వెయ్యాలి.
ఈ తీర్పుపై కేంద్ర ప్రజా ప్రభుత్వం ఆదర్శనీయమైన, సరైన తీరులో స్పందించాలని ఒక మామూలు పౌరుడిగా అప్పుడు కోరుకున్నాను. ఈ విషయంలో నవంబర్ 20న సుప్రీమ్ కోర్ట్ 5 మంది జడ్జస్ బెంచ్ ఇచ్చిన తీర్పులో రాష్ట్రపతి, గవర్నర్ ఈ ఇద్దరికీ రాజ్యంగం ఇచ్చిన ఉన్నత స్థానాన్ని కోర్టు గుర్తించినట్లుగా రూఢీ అయింది. B Pardiwala and R. Mahadevan వంటి జడ్జస్ ఏ లోపాయకారీ కారణాలతోనో రాష్ట్రపతి, గవర్నర్ అధికారాల విషయంలో తమ పరిధిని మించి ప్రవర్తించకాడదు; ఏ న్యాయమూర్తీ రాజ్యాంగాన్ని వక్రీకరించ కూడదు అన్న పాఠం సిలబస్ అయింది దక్షత, బాధ్యత, సరైన పనితీరు, దేశ సంక్షేమంపై దృష్టి, రాష్ట్ర పాలకుల అవినీతిని అదుపు చెయ్యాలన్న సత్సంకల్పం ఉన్న రాష్ట్ర గవర్నర్లకు ఈ తీర్పు ఉత్సాహాన్నిస్తోంది. రాష్ట్రపతి రాష్ట్రపతే; గవర్నర్ గవర్నరే…

– రోచిష్మాన్
9444012279