గత వందేళ్లలో ఇస్కాన్ తరువాత హిందూ మతం పరంగా జరిగిన పెను మేలు సత్యసాయి. నేను ఇస్కాన్, సత్యసాయి అనుయాయిని కాను. అయినా ‘సత్యసాయి వల్ల సగటు మనిషికి, సమాజానికి, హిందూ మతానికి, భారతదేశానికి కలిగిన, జరిగిన మేలు మామూలు విషయం కాదు’ అన్న వాస్తవాన్ని స్మరించుకోవడం ఒక మామూలు మనిషిగా (నేను ఏ మేధావిని కాను) నా బాధ్యత.
ప్రపంచాన్ని సత్యసాయి తనవైపుకు, హైందవం వైపుకు తిప్పుకోగలిగారు. జనహిత కార్యక్రమాలు… విద్య, వైద్యం, ఆకలి తీర్చడం, నీళ్లు అందివ్వడం వంటి పలు మహత్తరమైన జన హిత కార్యక్రమాలు సత్యసాయి ఒక విడి మనిషిగా చేశారు. పలు కుటుంబాలు, పలు ఊళ్లు, పలు జిల్లాలు సత్యసాయివల్ల లబ్ది పొందాయి.
ఈ ఒక్క విషయం చాలు సత్యసాయికి నమస్కరించడానికి; సత్యసాయిని కొనియాడడానికి. మొత్తం కమ్యూనిజమ్, నక్సలిజమ్ సాధించలేని, సాధించని ‘జన హితం’ అన్న పెను విజయాన్ని ఒకే ఒక్క సత్యసాయి సాధించారు! ‘ముస్లీమ్ శిరిడీ సాయిబాబా’ హైందవానికి ‘పెను విఘాతం’గా పరిణమించడం ఇవాళ క్షేత్ర వాస్తవం. సత్యసాయి హైందవానికి హానికరం కాలేదు. అంతేకాదు కమ్యూనిజమ్, అంబేడ్కరిస్టులు, నక్సల్స్, బుద్ధిస్ట్స్, కులోన్మాదం, విదేశీ మతోన్మాదం, మేధావర్గం, తెలుగు కవిత్వం వంటి వాటిలా సగటు మనిషికి, సమాజానికి, దేశానికి సత్యసాయి ‘హాని’ చెయ్యలేదు. కా(ర)ల్ మార్క్స్, బుద్ధుడు, అంబేడ్కర్ సగటు మానవులకు, సమాజానికి చెయ్యని, చెయ్యలేని ‘హితం’ సత్యసాయి చేశారు! ‘మేలు, మేలైన మేలు సత్యసాయి వల్ల మామూలు మనిషికి, సమాజానికి పెను మేలు మాత్రమే జరిగింది!’ సత్యసాయి తెలుగు మట్టిపై పుట్టిన శత సంవత్సరం ఇది. ‘జన హితం’ పరంగా మరి కొందరు సత్యసాయిలు ఇవాళ మనకు అవసరం. సత్యసాయికి ప్రణామాలు

9444012279